Animal OTT Release: అర్జున్ రెడ్డి ఫేమ్ టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి తెరకెక్కించిన యానిమల్ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. విడుదలైన ఆరు రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లో చేరి కొత్త రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా 500 కోట్ల కలెక్షన్లు రాబట్టిన బాలీవుడ్ సినిమాగా రికార్డ్ నెలకొల్పింది. ధియేటర్లలో ఊచకోత పూర్తి కాకుండానే ఓటీటీపై విరుచుకుపడేందుకు ఈ యానిమల్ సిద్ధమౌతోంది.
బాలీవుడ్ లవర్ బాయ్ రణబీర్ కపూర్ తొలిసారిగా పూర్తి స్థాయి వయోలెన్స్‌లో అత్యంత భయంకర రూపంలో కన్పించిన సినిమా యానిమల్. పేరుకు తగట్టే అతని ప్రవర్తన ఉంటుంది. రష్మిక మందన్నా కథానాయికగా , అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రల్లోకన్పిస్తారు. అర్జున్ రెడ్డితో తెలుగులో ఒక్క సినిమాతోనే ప్రాచుర్యం పొందిన సందీప్ రెడ్డి వంగా అదే సినిమాను కబీర్ సింగ్‌గా షాహిద్ కపూర్‌తో తీసి బాలీవుడ్లో పేరు సంపాదించేశాడు. ఇప్పుడు మూడవ సినిమా నేరుగా బాలీవుడ్‌తో తీసి ఇతర భాషల్లో సైతం విడుదల చేశాడు. ట్రైలర్‌తోనే సంచలనం రేపిన అంచనాలు పెంచుకున్న యానిమల్ సినిమా, డిసెంబర్ 1న థియేటర్లలో విడుదలవుతూనే సంచలనాలు నమోదు చేసింది. డిసెంబర్ 6 బుధవారంతో ఆరు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి అత్యంత వేగంగా 500 కోట్ల క్లబ్లో చేరిన బాలీవుడ్ సినిమాగా ఖ్యాతినార్జించింది.
తండ్రీ కొడుకుల డ్రామాకు యాక్షన్, రివెంజ్ అంశాల్ని జోడించిన సందీప్ రెడ్డి వంగా పూర్తి స్థాయి వయాలెన్స్ సినిమాగా చేసేశాడు. వయోలెన్స్ శృతి మించిందనే విమర్శలు వస్తున్నా సినిమాలో టేకింగ్, మేకింగ్‌తోపాటు రణబీర్ కపూర్, బాబీ డియోల్ నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అసలు రణబీర్‌లో ఈ కొత్త కోణం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. రష్మిక మందన్న కథానాయికగా, రణబీర్ కపూర్ తండ్రిగా అనిల్ కపూర్ కన్పించనున్నారు. ఇప్పుడీ సినిమా థియేటర్లలో ఊచకోత కోస్తుండగానే ఓటీటీలో విరుచుకుపడేందుకు సిద్ధమైంది.
యానిమల్ డిజిటల్ హక్కుల్ని రికార్డు ధరకు నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఈ బ్లాక్ బస్టర్ సినిమా జనవరి 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ సహా అన్ని భాషల్లో విడుదల కానుంది. యానిమల్ సినిమా థియేటర్ రన్‌టైమ్ 3 గంటల 21 నిమిషాలు. అయితే ఓటీటీలో మరో 20 నిమిషాలు ఎక్కువగానే సినిమా రన్‌టైమ్ ఉంటుందని తెలుస్తోంది. అంటే దాదాపు 3 గంటల 40 నిమిషాలు ఏకధాటిగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook