Bigg Boss 4 Telugu love stories: బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో రెండవ వారం ఊహించని మలుపులతో రియాలిటీ షో కొత్త మలుపులు తిరుగుతోంది. బిగ్ బాస్ హౌజ్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా ట్రయాంగిల్ లవ్ స్టొరీ ( Triangle love story in Bigg Boss 4 Telugu ) కొనసాగుతోంది. మోనల్ గజ్జర్‌కి దగ్గరవడానికి అభిజిత్, అఖిల్ ఇద్దరూ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మోనల్ కూడా ఎవరిని దూరం పెట్టాలో తెలియక ఇద్దరితోనూ సన్నిహితంగానే ఉంటోంది. ఐతే అదే సమయంలో మోనల్ వైఖరిని గమనిస్తే.. ఆమె అభిజీత్ కంటే అఖిల్‌తో ఉండటానికే ఎక్కువ ఇష్టపడుతున్నట్టుగానూ అనిపిస్తోందంటున్నారు బిగ్ బాస్ రియాలిటీ షో ఫ్యాన్స్. Also read : Bigg Boss Telugu 4: ‘నా ఫిగర్‌ను కూడా వదల్లేదు.. దమ్ముంటే ఆమెతో ట్రై చెయ్’
నిన్నటి ఎపిసోడ్లో ఇంటి సభ్యులు అందరూ డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని భోజనం చేస్తుండగా మోనల్ మాత్రం పక్కనే ఉన్న అభిజిత్‌ని ( Bigg Boss 4 Telugu contestant Abhijeeth ) అక్కడే వదిలేసి అఖిల్ ( Bigg Boss 4 Telugu contestant Akhil ) దగ్గరికి వెళ్లి అన్నం తినిపించమని అడిగింది. అఖిల్ రెండు ముద్దలు తినిపిస్తాడు. అభిజిత్ మాత్రం మోనల్ కోసం తినకుండా వెయిట్ చేస్తూ ఉన్నాడు. తరువాత మోనల్ తన సీటు వద్దకు వచ్చి తినడం స్టార్ట్ చేశాక.. అభిజిత్ ఆమెతో మాట్లాడుతూ.. ''నన్నెవరో బాగా తిట్టుకుంటున్నారు'' అని అంటాడు. అంటే ఇండైరెక్టుగా అఖిల్‌నే ఉద్దేశిస్తూ అభిజిత్ ఆ మాట అన్నట్టుగా ఆ సీన్ చూస్తే అర్థమైపోతుంది. Also read : Tamannaah in WFH mode: తమన్నా వర్క్ ఫ్రమ్ హోమ్
అంతకుముందు మరో ఎపిసోడ్లో అఖిల్‌కి అభిజిత్ ఓ సలహా ఇచ్చాడు. ''ఇక్కడ ఎవరిని ఇంప్రెస్ చేయల్సిన పని లేదు, నువ్వు నీలా ఉండు'' అని. కానీ అఖిల్‌కి ఆ సలహా ఇచ్చిన అభిజిత్ మాత్రం మోనల్‌తో మాట్లాడడానికి, ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండటం చూస్తోంటే.. అభిజీత్ తెలివిగా అఖిల్‌ని సైడ్ చేయాలని చూస్తున్నాడనే అర్థమవుతోందంటున్నారు ఈ షోను ఫాలో అవుతున్న ఆడియెన్స్. Also read : Actress Sravani Suicide Case: లొంగిపోయిన RX 100 నిర్మాత అశోక్ రెడ్డి
బిగ్ బాస్ 4 తెలుగు రియాలిటీ షోలో ఇక ఈ రోజు ప్రొమోని గమనిస్తే.. అభిజీత్‌తో మోనల్ ( Actress Monal Gajjar ) మాట్లాడుతూ.. 'నార్మల్‌గా మన ఫ్రెండుని, పార్ట్నర్స్ని మనమే సెలెక్ట్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఆ అవకాశం లేదు' అని అనగా.. 'చిన్నప్పుడు స్కూల్‌కి వెళ్ళినప్పుడు క్లాస్‌మెట్స్‌ని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా' అంటూ అభిజిత్ కౌంటర్ వేస్తాడు. ఆ తరువాత మోనల్కి గొంతు పొరపోగా.. వెంటనే అభిజిత్ ఆమె కోసం వాటర్ తీసుకురావడానికి వెళ్లగా అంతలోనే అఖిల్ వెళ్లి మోనల్కి వాటర్ ఇస్తాడు. ఇలా ఆ ముగ్గురి మధ్య జరుగుతున్న ఎపిసోడ్స్ అన్నీ గమనిస్తే.. అఖిల్, అభీజీత్ ఇద్దరూ మోనల్‌ని ( Bigg Boss 4 Telugu contestant Monal Gajjar ) ఇష్టపడుతున్నట్టే అనిపిస్తోంది అంటున్నారు ఈ సీన్స్ చూస్తున్న నెటిజెన్స్. ఈ విధంగా వీరి లవ్ స్టొరీ ఈ బిగ్ బాస్ షోలో ఓ హాట్ టాపిక్ అయ్యేలా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. Also read : Covid-19: నాగబాబుకు కరోనా పాజిటివ్
మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...
- Mahesh Babu: సర్కారు వారి పాటలో బాలీవుడ్ నటి!
- Renu Desai direction: తెలుగు సినిమా డైరెక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన రేణు దేశాయ్
- Bigg Boss 4 Voting Numbers: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్ ఓటింగ్ నెంబర్స్ ఇవే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYeR