Bahubali Kaja: బాహుబలి కాజా చూసి ఆశ్చర్యపోయిన శర్వానంద్, రష్మిక

Bahubali Kaja: ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అంటే చాలు గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా అలియాస్ మడత కాజా. అందుకే ఇక్కడికొచ్చే అందరికీ తాపేశ్వరం కాజా తప్పక పరిచయమౌతుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 25, 2021, 11:16 AM IST
  • రాజమండ్రిలో ఆడోళ్లు మీకు జోహార్లు సినిమా షూటింగ్
  • హీరో శర్వానంద్, హీరోయిన్ రష్మికలకు అరుదైన బహుమానం
  • సురుచి ఫుడ్స్ నుంచి బాహుబలి కాజా బహుకరణ
Bahubali Kaja: బాహుబలి కాజా చూసి ఆశ్చర్యపోయిన శర్వానంద్, రష్మిక

Bahubali Kaja: ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా అంటే చాలు గుర్తొచ్చేది తాపేశ్వరం కాజా అలియాస్ మడత కాజా. అందుకే ఇక్కడికొచ్చే అందరికీ తాపేశ్వరం కాజా తప్పక పరిచయమౌతుంది.

తూర్పు గోదావరి జిల్లాకు వెళితే చాలు తాపేశ్వరం కాజా లేదా ఆత్రేయపురం పూతరేకులు తిన్నారా అని ఎవరైనా అడుగుతారు. అంతగా ప్రాచుర్యం పొందిన స్వీట్స్ ఇవి. ఓ విధంగా చెప్పాలంటే ఆ స్వీట్స్‌తో ఆ ఊర్లకే పేరొచ్చింది. అందుకే ఆ స్వీట్స్ అందరికీ సుపరిచితం. ఇక్కడికి వచ్చిన ప్రముఖులంతా అడిగి మరీ రప్పించుకుంటారు. తిని ఆనందిస్తుంటారు. లేదా కొన్ని సందర్భాల్లో ఆ స్వీట్స్ షాప్ యజమానులే జిల్లాకొచ్చిన ప్రముఖులకు ఓ సంప్రదాయంగా తెచ్చి ఇస్తుంటారు. ఇందులో తాపేశ్వరం కాజా అంటే సురుచి ఫుడ్స్ అధినేత మల్లిబాబు ప్రత్యేకం. బాహుబలి సైజ్ కాజాలు(Bahubali kaja)తయారు చేసి అందిస్తుంటారు. అదే జరిగింది రాజమండ్రిలో. 

సినిమా షూటింగ్ నిమిత్తం రాజమండ్రికి వచ్చిన సినీ తారలను సురుచి ఫుడ్స్ సంస్థ భారీ కాజాతో సత్కరించింది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రం షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. ఈ సందర్భంగా హీరో శర్వానంద్(Sharwanand), హీరోయిన్ రష్మికలకు బాహుబలి కాజాల్ని అందించారు. ఆ కాజా పరిమాణం చూసి అటు శర్వానంద్, ఇటు రష్మిక(Rashmika)ఆశ్యర్యపోయారు. తాపేశ్వరం మడత కాజా అంటే తనకు చాలా ఇష్టమని..గతంలో కూడా సురుచి స్వీట్ స్టాల్ సందర్శించానని చెప్పుకొచ్చారు శర్వానంద్. గతంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వంటి ప్రముఖులకు కూడా బాహుబలి కాజా అందింది.

Also read: Charmi: 'ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి..కానీ నాకు నటించాలని లేదు'..: చార్మి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News