Epfo Pension Eligibility: ప్రైవేట్ ఉద్యోగులకు పీఎఫ్‌లో పెన్షన్ కింద కొంత అమౌంట్ కట్ అవుతున్నా.. తాము పెన్షన్‌కు ఎలా అర్హులవుతామో చాలామందికి తెలియదు. ఎన్ని ఏళ్లు ప్రైవేట్ జాబ్ చేస్తే మీరు పెన్షన్ అర్హులు..? నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకోండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తున్న వారికి జీతంలో ఎక్కువ భాగం ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్)కు వెళుతుంది. ప్రతి నెలా ఉద్యోగి జీతంలో కొంత కట్ చేసి అతని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. అయితే పెన్షన్‌కు ఎప్పుడు అర్హులవుతారో చాలామందికి తెలియదు.
మీరు ప్రైవేట్ ఉద్యోగం చేసి.. 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినట్లయితే మీరు కూడా పెన్షన్‌కు అర్హులవుతుతారు. ఈపీఎఫ్‌ఓ రూల్స్ ప్రకారం 10 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగి.. ఆ తరువాత ఉద్యోగం మానేసినా అతను పెన్షన్ పొందేందుకు అర్హులు.
ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగి బేసిక్ పే, డీఏలోని 12 శాతం ప్రతి నెలా పీఎఫ్ ఖాతాలోకి వెళ్తుంది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి మినహాయించబడిన మొత్తం భాగం EPFకి వెళుతుంది. అయితే యజమాని కంపెనీ వాటాలో 8.33% ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS)కి, 3.67% ప్రతి నెల EPF కంట్రిబ్యూషన్‌కు వెళ్తుంది.
అయితే పెన్షన్ పొందేందుకు మాత్రం కచ్చితంగా 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకోవాలి. మీరు 9 ఏళ్ల 6 నెలలు పనిచేసి.. జాబ్ మానేసినా అది 10 ఏళ్లుగానే లెక్కిస్తారు. మీరు ఎన్ని కంపెనీలు మారినా.. ఒకే యూఎఎన్ నంబరు ఉండాలి. 10 సంవత్సరాల మధ్య అన్ని ఉద్యోగాలను కలిపి ఒకే సర్వీస్‌గా తీసుకుంటారు. మొత్తం పదేళ్ల సర్వీస్ కాలానికి ఒక యూఎన్ మాత్రమే ఉంటే పెన్షన్‌కు అర్హులవుతారు.
మీరు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి ఉద్యోగం మారినా ఒకే యూఎఎన్ నంబరు ఉండేలా చూసుకోవాలి. మీరు పని చేసిన కంపెనీల నుంచి మీ పీఎఫ్ ఖాతాలో జమ అయిన మొత్తం డబ్బు అదే యూఎఎన్‌లో కనిపిస్తుంది. అయితే రెండు ఉద్యోగాల మధ్య గ్యాప్ ఉంటే.. ఆ గ్యాప్‌ను తీసేసి కొత్త ఉద్యోగంలో జాయిన తరువాత నుంచి లెక్కేస్తారు. మీరు ఉద్యోగం మారే సమయంలో గ్యాప్ ఉన్నా భయపడాల్సిన పనిలేదు. మీరు 10 ఏళ్ల సర్వీస్ కాలాన్ని పూర్తి చేస్తే పెన్షన్‌కు అర్హులవుతారు. మీకు 58 ఏళ్లు నిండిన తరువాత.. అప్పటి నిబంధనలు బట్టి మీకు ప్రతి నెల పెన్షన్ అందుతుంది.
Also Read: DMK Saidai Sadiq: కుష్బుకు డీఎంకే నేత క్షమాపణలు.. ఐటమ్స్ అంటూ చేసిన వ్యాఖ్యలపై వివరణ
Also Read: Aarogyasri: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆరోగ్యశ్రీలోకి మరో 809 చికిత్సలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook