Aadhaar Card Check: ప్రభుత్వ, ప్రైవేట్ పనులకు, బ్యాంక్ ఎక్కౌంట్ ఓపెన్ చేసేందుకు, సిమ్ కార్డు తీసుకునేందుకు ఇలా అన్నింటికీ ఆధార్ కార్డు అవసరం. కానీ కొంతమంది నకిలీ ఆధార్ కార్డులు కూడా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో ఆధార్ కార్డు అసలుదా నకిలీదా అనేది తెలుసుకోగలగాలి. లేకపోతే సమస్యలు ఎదురు కావచ్చు. ఆధార్ కార్డు నకిలీదా కాదా అనేది ఎలా తెలుసుకోవచ్చో చూద్దాం
మీ ఆధార్ కార్డు అసలుదా లేదా నకిలీనా అనేది తెలుసుకునేందుకు ముందుగా యూఐడీఏఐ అధికారిక పోర్టల్ https://resident.uidai.gov.in/verify ఓపెన్ చేయాలి. ఇప్పుడు అందులో మై ఆధార్ ఆప్ష్ ఎంచుకోవాలి. ఆ తరువాత ఆధార్ సర్వీసెస్ సెక్షన్ క్లిక్ చేయాలి.
ఇప్పుడు ఈ సెక్షన్ నుంచి ఆధార్ వెరిఫై సెక్షన్ క్లిక్ చేయాలి. ఆ తరువాత ఆధార్ నెంబర్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీ ముందు ఆధార్ వెరిఫికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడిక్కడ మీ 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇప్పుడు అక్కడ స్క్రీన్ పై కన్పించే వెరిఫై బటన్ ప్రెస్ చేయాలి. ఆ తరువాత మీ ఆధార్ కార్డు స్టేటస్ కన్పిస్తుంది. దాంతో మీ ఆధార్ కార్డు అసలుదా లేక నకిలీదా అనేది తేలిపోతుంది.
Also read: Platform Ticket Rules: ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణం చేయవచ్చా లేదా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook