Jio Recharge Limited offer: 200 రోజులకు 500 జీబీ డేటా, 2150 రూపాయల కూపన్లు, వెంటనే రీఛార్జి చేయించుకోండి

Jio Recharge Limited offer: దేశంలో అతి పెద్ద ప్రైవేట్ టెలీకం కంపెనీ రిలయన్స్ జియో ఇటీవల అద్భుతమైన రీఛార్జి ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ ముగిసేందుకు మరో రోజే మిగిలింది. ఆ తరువాత ఈ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఈ ప్లాన్ కావల్సినవారు వెంటనే రీఛార్జి చేయించుకోవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 30, 2025, 07:16 PM IST
Jio Recharge Limited offer: 200 రోజులకు 500 జీబీ డేటా, 2150 రూపాయల కూపన్లు, వెంటనే రీఛార్జి చేయించుకోండి

Jio Recharge Limited offer: రిలయన్స్ జియో కొత్త ఏడాది ప్రారంభంలో బంపర్ రీఛార్జి ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ద్వారా 200 రోజుల వ్యాలిడిటీ, 500 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. ఇంటర్నెట్ డేటా ఎక్కువగా అవసరమైన వారికి ఈ ప్లాన్ చాలా బెస్ట్. ఈ ప్లాన్ గడువు రేపు అంటే జనవరి 31తో ముగియనుంది. 

రిలయన్స్ జియో యుజర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్స్ అందిస్తుంటుంది. అందులో భాగంగా న్యూ ఇయర్ పురస్కరించుకుని కొత్త ప్లాన్ ప్రవేశపెట్టింది. అయితే ఇది పరిమిత కాలపు ప్లాన్. స్పెషల్ ప్లాన్ కావడంతో జనవరి 31తో ముగియనుంది. అంటే రేపే చివరి తేదీ. ఈ ప్లాన్ లో 200 రోజులు వ్యాలిడిటీ ఉంటుంది. ఇక డేటా అయితే ఏకంగా 500 జీబీ లభిస్తుంది. అంటే రోజుకు 2.5 జీబీ డేటా పొందవచ్చు. అది కూడా హైస్పీడ్ డేటా. ఇంటర్నెట్ అధికంగా వినియోగించేవారికి ఇది చాలా అవసరం. 

ఈ రెండింటితో పాటు అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ సౌకర్యం ఉంటుంది. జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఇన్ని ప్రయోజనాలతో ఉండే ఈ ప్లాన్ టారిఫ్ 2025 రూపాయలు మాత్రమే. ఇక్కడితో పూర్తి కాలేదు. ఇంకా లాభాలున్నాయి. ఈ ప్లాన్ తీసుకుంటే 2150 రూపాయల విలువైన కూపన్లు లభిస్తాయి. 2500 రూపాయలకు పైగా షాపింగ్ చేస్తే అజియో నుంచి 500 రూపాయలు డిస్కౌంట్ కూపన్ ఉంటుంది. 150 రూపాయలు స్విగ్గీ కూపన్, 1500 రూపాయలు విమాన టికెట్ డిస్కౌంట్ లభిస్తాయి. 

ఈ ప్లాన్ గడువు జనవరి 31తో ముగుస్తోంది. రిలయన్స్ తాజాగా అత్యధికంగా ప్రాచుర్యం పొందిన రెండు రీఛార్జి ప్లాన్స్ 189, 479 రూపాయల ప్లాన్స్ తొలగించింది. 2025 రూపాయల న్యూ ఇయర్ ప్లాన్ కు మంచి స్పందనే లభిస్తోంది. అయితే జనవరి 31తో గడువు ముగియనుంది. లాంగ్ వ్యాలిడిటీ, అత్యధిక డేటా అవసరమైన వారికి ఇదే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు రీఛార్జి చేయించుకుంటే దాదాపుగా 7 నెలలు పనిచేస్తుంది. 

Also read: Bank Jobs 2025: బ్యాంక్ ఆప్ మహారాష్ట్రలో ఉన్నత ఉద్యోగాలు, రాత పరీక్ష లేకుండానే 1.73 లక్షల జీతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News