LIC IPO: చాలా ఆశలు రేపిన ఎల్ఐసీ నిరాశ పబ్లిక్ ఇష్యూ నిరాశ కల్గిస్తోంది. ఇష్యూ ప్రైస్ కంటే తక్కువకు లిస్టవడంతో షేర్ హోల్డర్లు ఇబ్బందులకు గురవుతున్నారు.
దేశంలో అతిపెద్ద ఐపీవోగా లాంచ్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. మార్కెట్‌లో ఇష్యూ ప్రైస్ కంటే తక్కువకు లిస్టయింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో ఎల్ఐసీ ఐపీవో పతనం దిశగానే సాగుతోంది. వరుసగా ఐదవరోజు ఎల్ఐసీ షేర్ పతనమై..3 శాతానికి నష్టపోయింది. అంటే ప్రస్తుతం ఎల్ఐసీ షేర్ ధర 777.40 రూపాయలకు చేుకుంది. ఆ తరువాత మంగళవారం నాటికి..మరింతగా తగ్గి..754 రూపాయల వద్ద ముగిసింది. ఎల్ఐసీ ఇష్యూ ధర 930-960 రూపాయల మధ్య పలికింది.
బీఎస్ఈలో కంపెనీ మార్కెట్ విలువ 4 లక్షల 91 వేల 705.32 కోట్లకు చేరుకుంది. ఐపీవో ధరతో పోలిస్తే ఇది 18 శాతం తగ్గుదలగా ఉంది. మే 17వ తేదీన అతిపెద్ద భీమా కంపెనీగా లిస్టైన ఎల్ఐసీ స్టాక్ క్రమంగా పతనమవుతూ వస్తోంది. మార్కెట్ క్యాప్..ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సి, భారతి ఎయిర్‌టెల్ కంటే ఎక్కువగా ఉంది. వైవిద్యమైన ఉత్పత్తి లేకపోవడం వల్లనే మార్కెట్ వాటా నిరంతరం క్షీణిస్తోందని ఆర్ధిక సంస్థ చెబుతోంది.
Also read: Aadhaar Card: మీ ఆధార్ కార్డు దుర్వినియోగమౌతోందా..ఇలా చెక్ చేసి..లాక్ చేసుకోండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook