Gold Price Today 18 April 2024: బంగారం ధరలు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరగడం చూస్తూనే ఉన్నాం. సాధారణంగా పెళ్లిళ్లు, పేరంటాలకు ముఖ్యంగా బంగారాన్నే కోనుగోలు చేస్తారు. అయితే, ఈ సమయంలో బంగారం ధరలు ఆకాశన్ని అంటాయి. దీంతో బంగారం కొనాలంటే సామాన్యులు బెదిరిపోతున్నారు. బంగారానికి ప్రత్యామ్నాయం గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంతేకాదు బంగారం అంటే ఆడవాళ్లకు కూడా మక్కువ. అందుకే వాళ్ల ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్లు చేస్తారు. పెట్టుబడుల కంటే కూడా ఆభరణాల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే, ఈ మధ్య కాలంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వాటి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తులో ఉన్నాయి. ఈనేపథ్యంలో ఈరోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇదీ చదవండి: తగ్గిన ముడి చమురు ధరలు.. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
ఈ వారంలో బంగారం రేట్లు భారీగా హెచ్చుతగ్గులను చూస్తూనే ఉన్నాం. పది గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ. 74,120 వద్ద స్థిరంగా ఉంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.67,940 వద్ద ఉంది. ఇక వెండి విషయానికి వస్తే మార్కెట్లో కిలో వెండి ధర రూ. 86,400 వద్ద కొనసాగుతోంది.
ఇదీ చదవండి: త్వరలోనే గూగుల్ నుంచి వాలెట్ యాప్.. phone pe, payment యూపీఐ యాప్స్ పనైపోయినట్లేనా?
2024 ఏప్రిల్ 18 గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
ముంబైలో పది గ్రాముల బంగారం 24 క్యారట్ల ధర రూ. 74,120 వద్ద ఉంది. ఇక 22 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.67,940 వద్ద ఉంది. ఈరోజు ఢిల్లీ పది గ్రాముల బంగారం ధర విషయానికి వస్తే 22 క్యారట్లకు రూ.68,090. ఇక 24 క్యారట్ల బంగారం ధర పది గ్రాములకు రూ.74,270 వద్ద ఉంది. అహ్మదాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర 22 క్యారట్లు రూ. 68,020 వద్ద ఉంది. పది గ్రాముల బంగారం ధర 24 క్యారట్లు రూ.74,170 వద్ద కొనసాగుతోంది. ఈరోజ mcx గోల్డ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్‌లో యాక్టీవ్‌గా ట్రెండ్ ముగిసింది. మార్కెట్ ఒడిదుడుకుల మధ్య ఇన్వెస్టర్లు, ట్రేడర్లు సైతం బంగారం, వెండి ధరలను నిశితంగా పరిశీలిస్తున్నారు.
నగరం | 22 క్యారెట్ల బంగారం ధర | 24-క్యారెట్ బంగారం ధర |
హైదరాబాద్ | రూ. 67,940 | రూ. 74,120 |
చెన్నై | రూ. 68,690 | రూ. 74,940 |
కోల్‌కతా | రూ. 67,940 | రూ. 74,120 |
లక్నో | రూ. 68,090 | రూ. 74,270 |
బెంగళూరు | రూ. 67,940 | రూ. 74,120 |
జైపూర్ | రూ. 68,090 | రూ. 74,270 |
(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook