EV Cars Market: దేశంలో ఈవీ కార్ల వినియోగం పెరిగే కొద్దీ కొత్త, పాత కంపెనీలు ఆ రంగంలో తమ కార్లు ప్రవేశపెడుతున్నాయి. రానున్న కొన్నేళ్లలో ఇండియాలో కొత్త కొత్త ఎలక్ట్రిక్ కార్లు లాంచ్ కానున్నాయి. మారుతి, హ్యుండయ్, టాటా, మహీంద్రాలు కొత్త ఈవీ కార్లను ప్రవేశపెట్టనున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
దేశంలో త్వరలో మారుతి సుజుకి, హ్యుండయ్ మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయనున్నాయి. అన్నింటికంటే ముందుగా టాటా మోటార్స్ నుంచి టాటా పంచ్ ఈవీ మార్కెట్‌లో రానుంది. టాటా పంచ్ ఈవీ తరువాత 2024 చివర్లో మహీంద్రా ఎక్స్‌యూవీ ఇ8 లాంచ్ కావచ్చు. ఆ తరువాత మారుతి సుజుకి ఇవీఎక్స్ లాంచ్ అవుతుంది. తరువాత హ్యుండయ్ కంపెనీ 2025లో క్రెటా ఈవీ లాంచ్‌కు సిద్ధమౌతోంది.
మారుతి ఇవీఎక్స్
మారుతి సుజుకి కంపెనీ ఇవీఎక్స్ కాన్సెప్ట్‌ను ఇదే ఏడాది ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించింది. ఈ కారు ప్రొడక్షన్ వెర్షన్ 48 కిలోవాట్స్ , 60 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. ఇది ఫుల్‌ఛార్జ్‌పై 400, 500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. క్రెటా ఈవీకు ఇది పోటీ కాగలదు.
హ్యుడయ్ క్రెటా ఈవీ
హ్యుండయ్ కంపెనీ 2025లో క్రెటా ఈవీ లాంచ్‌కు సిద్ధమౌతోంది. ప్రస్తుతం ప్రాధమిక పరీక్ష దశలో ఉంది. 2025 ప్రారంభానికి లాంచ్ కావచ్చని అంచనా. ఇందులో హ్యుండయ్ కోనా ఈవీకు చెందిన పవర్ ట్రేన్ ఉండవచ్చు,. ఇదులో 39.2 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఫుల్‌ఛార్జ్‌పై 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
టాటా పంచ్ ఈవి
టాటా పంచ్ ఈవీ ఈ ఏడాది చివర్లో లాంచ్ కావచ్చు. టాటా పంచ్ ఈవీలో టాటా జిప్‌ట్రాన్ టెక్నీక్ లభిస్తుంది. ఇందులో లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ, పర్మనెంట్ మేగ్నైట్ సింక్రోనస్ మోటార్ ఉన్నాయి. ఇది రెండు బ్యాటరీ ఆప్షన్లు 19.2 కిలోవాట్స్, 24 కిలోవాట్స్‌తో వస్తోంది. వీటి పరిధి 300 కిలోమీటర్లు ఉంటుంది.
మహీంద్రా ఎక్స్‌యూవీ ఇ8
మహీంద్రా ఎక్స్‌యూవీ ఇ8 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ. ఇందులో బోల్డ్ డిజైన్ ఉంది. ఎక్స్‌యూవీ ఇ8లో భారీ బ్యాటరీ ప్యాక్ అంటే 60-80 కిలోవాట్స్ ఉంటుంది. పుల్‌ఛార్జిపై 400 నుంచి 450 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook