Virus Threat to iOS Users: ఐఫోన్లను వెంటాడుతున్న ఈ వైరస్ పేరు గోల్డ్‌పికాక్స్ ట్రోజన్ వైరస్. వాస్తవానికి ఈ వైరస్ చాలాకాలం నుంచి ఉన్నదే అయినా ఇప్పుడు కొత్తగా కేవలం ఐఫోన్ యూజర్లను వెంటాడుతోంది. అడ్వాన్స్ ఫీచర్లతో కలిగిన వైరస్ కావడంతో ఐఫోన్ యూజర్లకు ఆందోళన పెరుగుతోంది.
Goldpickaxe Trojan Virus ఐఫోన్లలో ప్రవేశించి యూజర్ల బ్యాంక్ ఖాతాల్ని ఖాళీ చేస్తోంది. ఫోన్‌లోని ముఖ్యమైన డేటాను దొంగిలించి ప్రమాదకరంగా మారుతోంది. బ్యాంక్ ఖాతాల్నించి డబ్బులు తస్కరిస్తోంది. అందుకే ఈ కొత్త వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌ను గత ఏడాది అక్టోబర్‌లో తొలిసారిగా గుర్తించారు. ఆ తరువాత ఈ గోల్డ్‌పికాక్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతూ వస్తోంది. ఎంతలా అప్‌డేట్ అయిందంటే ఐవోఎస్ డివైస్‌లకు కూడా ముప్పుగా పరిణమించింది. ఫేషియల్ రికగ్నిషన్ డేటా, ఐడెంటిటీ డాక్యుమెంట్స్, టెక్స్ట్ మెస్సేజ్‌లను స్కాన్ చేస్తోంది. అందులో బ్యాంకింగ్ సమాచారం ఉంటే మాత్రం అంతే సంగతులు..ఎక్కౌంట్ ఖాళీ అయిపోతోంది.
బయోమెట్రిక్ డేటా లభిస్తే ఏఐ ఆధారిత డీప్ ఫేక్స్ చేసి, ఆథరైజేషన్ లేకుండా బ్యాంక్ ఎక్కౌంట్స్‌తో యాక్సెస్ పొందడం, ఎక్కౌంట్లు ఖాళీ చేయడం జరుగుతోంది. ఈ తరహా కేసులు ఇప్పటి వరకూ వియత్నాం, థాయ్‌లాండ్ దేశాల్లో వెలుగుచూశాయి. త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు కూడా విస్తరించవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ఆండ్రాయిడ్ ఫోన్లలో సులభంగా వెళ్తుంది. కానీ ఐవోఎస్ డివైస్‌లో చొరబడటం అసాధ్యం. కానీ ఆపిల్ మొబైల్ అప్లికేషన్ టెస్టింగ్ ప్లాట్‌ఫామ్‌గా ఉన్న టెస్ట్ ఫ్లైట్‌ను హ్యాక్ చేసి తద్వారా గోల్డ్‌పికాక్స్ వైరస్ వ్యాప్తి చేస్తున్నట్టుగా అంచనా ఉంది.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
సాధ్యమైనంతవరకూ టెస్ట్ ఫ్లైట్ నుంచి యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోకూడదు. మొబైల్ డివైస్ మేనేజ్‌మెంట్ ప్రొఫైల్స్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది. యూఎస్‌బి ద్వారా మ్యాక్‌కి కనెక్ట్ చేసేటప్పుడు మాల్‌వేర్ స్కానింగ్ సెటప్ రన్ చేయాల్సి ఉంటుంది. లాక్‌డౌన్ మోడ్ ఆన్ చేసి ఆపిల్ స్టోలెన్ డివైజ్ ప్రొటెక్షన్ యాడ్ చేయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలావరకూ ఈ గోల్డ్‌పికాక్స్ ట్రోజన్ వైరస్ నుంచి కాపాడుకోవచ్చు.
Also read: Paytm FAQs and Answers: పేటీఎంపై మీ సందేహాలు ప్రశ్నలకు ఆర్బీఐ సమాధానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook