8th Pay Commission Updates in Telugu: వేతన సంఘం ఏర్పాటు నుంచి ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతభత్యాలు, పెన్షన్లలో భారీ పెరుగుదల వస్తోంది. 1946లో మొదటి వేతన సంఘం నుంచి ఇప్పటి వరకూ 7 వేతన సంఘాలు ఏర్పడ్డాయి. ప్రతిసారీ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాల్లో మార్పు వచ్చింది. ఈసారి కూడా భారీ మార్పు ఆశిస్తున్నారు. అందుకే 8వ వేతన సంఘం కోసం డిమాండ్ చేస్తున్నారు.
గతంలో 5వ, 6వ, 7వ వేతన సంఘం ఏర్పడినప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షనర్ల పెన్షన్‌లో మార్పు వచ్చింది. ఇప్పుడు కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు. గత మూడు వేతన సంఘాల్లో ఎలాంటి పెరుగుదల నమోదైంది, కనీస, గరిష్ట వేతనం ఎలా ఉండబోతుంది, 8వ వేతన సంఘంలో ఏ మేరకు మార్పు రావచ్చనేది పరిశీలిద్దాం. అసలు ప్రభుత్వం వేతన సంఘం ఎందుకు ఏర్పాటు చేస్తుందనేది తెలుసుకుందాం
వేతన సంఘం ఏర్పాటు ఎందుకు
వేతన సంఘం అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, పెన్షన్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగిన మార్పులు చేసేందుకు ఉద్దేశించింది. ద్రవ్యోల్బణం రేటు, ఆర్ధిక పరిస్థితుల ఆధారంగా వేతన సంఘం ఉద్యోగుల జీతభత్యాల్లో చేయాల్సిన మార్పుచేర్పుల్ని సూచిస్తుంది. దేశంలో మొదటి వేతన సంఘాన్ని 1946 జనవరిలో ఏర్పాటు చేశారు. అంటే స్వాతంత్య్రానికి పూర్వమే. కమీషన్ నివేదిక మాత్రం 1947 మేలో వచ్చింది. అప్పటి నుంచి వేతన సంఘాలు ప్రతి పదేళ్లకోసారి ఏర్పడుతున్నాయి. తాజాగా 2016 జనవరిలో 7వ వేతన సంఘం ఏర్పాటైంది. అదే ఇప్పుడు నడుస్తోంది. వేతన సంఘం ఏర్పడి అమల్లోకి వచ్చేందుకు కనీసం రెండేళ్ల వ్యవధి పడుతుంది. అందుకే 2026లో 8వ వేతన సంఘం అమలు కావాలంటే ఇప్పుడు ఏర్పడాల్సి ఉంది
జీతభత్యాలు, పెన్షన్లలో గత వేతన సంఘాల్లో వచ్చిన మార్పులు
5వ వేతన సంఘం ఏర్పాటు
5వ వేతన సంఘం 1994 ఏప్రిల్ నెలలో ఏర్పడగదా జనవరి 1996 నుంచి అమల్లోకి వచ్చింది. కనీస వేతనం 2,750 రూపాయలు ఉండేది. రిడక్షన్ పే స్కేల్ 51 నుంచి 34 చేశారు. ప్రభుత్వ సిబ్బందిని 30 శాతం తగ్గించారు. గ్రాట్యుటీ సీలింగ్‌ను 2.5 లక్షల నుంచి 3.5 లక్షలకు చేశారు.
6వ వేతన సంఘం ఏర్పాటు
6వ వేతన సంఘాన్ని 2006 జూలైలో ఏర్పాటు చేయగా ఆగస్టు 2008 నుంచి అమల్లోకి వచ్చింది. కనీస వేతనం 7000 అయింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.74 శాతం ఉండగా ప్రభుత్వం 1.86 శాతం చేసింది. 2006 జనవరి 1 నుంచి ఎరియర్లు చెల్లించారు. అలవెన్స్ లు 2008 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. లివింగ్ అలవెన్స్ 16 శాతం నుంచి 22 శాతమైంది
7వ వేతన సంఘం ఏర్పాటు
7వ వేతన సంఘాన్ని 2014 ఫిబ్రవరి 28న ఏర్పాటు చేయగా, 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. కనీస వేతనం 18 వేలు అయింది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతమైంది. కనీస వేతనం 7 వేల నుంచి ఏకంగా 18 వేలకు పెరిగింది. కొత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టారు. పెన్షన్ రివిజన్ జరిగింది.
Also read: Banks 5 Days Week and Timings: త్వరలో బ్యాంకులకు 5 డే వీక్, కొత్త పనివేళలు ఇవే
8వ వేతన సంఘం కోసం
8వ వేతన సంఘం 2026 నుంచి అమల్లోకి రావల్సి ఉంది. అందుకే ఇప్పుడు ఏర్పాటయితే అమల్లోకి వచ్చేందుకు రెండేళ్ల సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘం ఎప్పుడు ఏర్పాటు చేస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. జీతం 20-30 శాతం పెరగవచ్చని అంచనా ఉంది. లెవెల్ 1 ఉద్యోగుల జీతాలు 34,560 రూపాయు లెవెల్ 18 ఉద్యోగుల జీతాలు 4.8 లక్షలు ఉండవచ్చు. పెన్షనర్లు, రిటైర్ అయిన సిబ్బందికి ప్రయోజనాలు ఉండవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతం ఉంటుందని అంచనా. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా కనీస వేతనం 34,560 రూపాయలు ఉండవచ్చు. కనీస పెన్షన్ 17,280 రూపాయలు ఉంటుందని అంచనా.
Also read: AP Heavy Rains Alert: వాయుగుండంగా మారిన అల్పపీడనం, ఏపీలోని ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.