Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

Lok Sabha Election Voting Percentage Top 5 List Here: విజయోత్సాహంపై ఉన్న టీడీపీకి వైఎస్సార్‌సీపీ భారీ షాక్‌ ఇచ్చింది. ఎన్నికల ఓటింగ్‌ శాతంపై ఈసీ విడుదల చేసిన నివేదిక వైఎస్సార్‌సీపీ టాప్‌ 5లో ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 14, 2024, 09:54 PM IST
Vote Percentage: తెలుగుదేశం పార్టీకి భారీ షాక్‌.. వైఎస్సార్‌సీపీకి కలిసొచ్చిన అదృష్టం

Boos To YSRCP: ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఊరట కలిగించే ఒక పరిణామం జరిగింది. బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీకి మాత్రం కొంచెం ఇబ్బందికర విషయమే ఇది. ఎన్నికల్లో అత్యధిక ఓట్లను పొందిన జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ జాబితాలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఐదో స్థానంలో నిలవగా.. అధికార తెలుగుదేశం పార్టీ మాత్రం ఆరో స్థానంతో సరిపెట్టుకుంది.

Also Read: Arudra Help: నాడు జగన్‌ పట్టించుకోలేదు... నేడు ఆరుద్రను అక్కున చేర్చుకున్న చంద్రబాబు

దేశంలో అత్యధిక ఓట్లను సాధించిన పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలోనే అత్యధిక ఓట్ల శాతం పొందిన పార్టీలలో మొదటి ఐదు స్థానాలలో టీడీపీకి చోటు దక్కలేదు. అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుపొందిన బీజేపీ 36.6 శాతం ఓట్లను సాధించి తొలి స్థానంలో నిలిచింది. ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ 21.96 ఓట్ల శాతంతో రెండో స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తరప్రదేశ్‌లో సంచలన విజయం సాధించిన అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాది పార్టీ 4.58 శాతం ఓట్లతో మూడో స్థానంలో ఉంది. 4.37 శాతం ఓట్లతో మరో పార్టీ నాలుగో స్థానాన్ని దక్కించుకుంది.

Also Read: RK Roja CID: మంత్రిగా ఆర్కే రోజా రూ.100 కోట్ల అవినీతి.. సీఐడీకి ఫిర్యాదుతో ఏపీలో కలకలం

 

ధీమాతో వైసీపీ
ఈ ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ, 4 పార్లమెంట్‌ స్థానాలను నెగ్గిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఐదో స్థానంలో నిలవడం విశేషం. 2.06 ఓట్ల స్థానంతో వైఎస్సార్‌సీపీ నిలవడం ఆ పార్టీకి ఊరటనిచ్చే విషయం. ఒక వైసీపీ తప్ప పై పార్టీలన్నీ ఏదో ఒక పార్టీతో కూటమి కట్టడం గమనార్హం. వైసీపీ మాత్రం సొంతంగా ఓట్లను సాధించింది. 1.98 శాతంతో తెలుగు దేశం పార్టీ మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకోవడం మింగుడు పడని విషయం. బీజేపీ, జనసేనతో జతకట్టిన టీడీపీ అంత తక్కువ ఓట్ల శాతం పొందడం గమనించదగిన అంశం. ఈ నివేదికతో వైసీపీ సంబరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాలను విశ్లేషణ చేసుకున్న ఆ పార్టీ ఓటమి శాతం తక్కువే అని చెబుతున్నది. కూటమికి తమ పార్టీకి మధ్య ఓట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉందని వాదిస్తోంది. ఈ వాదనకు తాజాగా ఎన్నికల సంఘం వెలువరించిన నివేదిక కొంత బలం చేకూరినట్టు అయ్యింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News