TDP-Janasena Manifesto: ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఫిబ్రవరి రెండవ వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్ధుల కసరత్తులో ఉన్నారు. ఇక ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం మిత్రపక్షం జనసేన కలిసి మేనిఫెస్టో సిద్ధం చేస్తున్నాయి. సంక్రాంతి అనంతరం మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
ఏపీలో అధికార పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ముందుగా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్ధుల ఎంపిక చేస్తోంది. ఇప్పటి మూడు జాబితాలు విడుదలయ్యాయి. త్వరలో నాలుగో జాబితా విడుదల కానుంది. అటు తెలుగుదేశం-జనసేన కూటమి ఇంకా సీట్లు సర్దుబాటు, అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మరోవైపు ఉమ్మ డి ఎన్నికల మేనిఫెస్టో దాదాపు సిద్ధం చేసింది. సంక్రాంతి అనంతరం అంటే జనవరి 18 లేదా 21 తేదీల్లో ఏదైనా కీలకమైన ప్రాంతంలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమౌతున్నాయి. ఉమ్మడి మేనిఫెస్టో కోసం ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమైన చంద్రబాబు-పవన్ కళ్యాణ్‌లు తాజాగా మరోసారి భేటీ అయ్యారు. ఈ ఇద్దరితో పాటు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ ఇతర నేతలున్నారు. మొత్తం 12 అంశాలతో మేనిఫెస్టో రూపకల్పన జరిగినట్టు తెలుస్తోంది.
ఈ 12 అంశాల్లో ఆరు అంశాల్ని తెలుగుదేశం మహానాడు సందర్భంగా ఇప్పటికే విడుదల చేసింది. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్న పిల్లలందరికీ ఏడాదికి 15 వేల రూపాయలు, ఎపీఎస్సార్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పధకంలో కుటుంబానికి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, 18 ఏళ్లు నిండిన మహిళకు నెలకు 1500 రూపాయలు, అన్నదాత పథకంలో భాగంగా ఏడాదికి రైతులకు 20 వేల రూపాయలు, ప్రతి నిరుద్యోగికి 3 వేల రూపాయల అర్ధిక సహాయం ఇప్పటికే టీడీపీ ప్రకటించిన ఆరు పధకాల్లో ఉన్నాయి. వీటిని సూపర్ సిక్స్‌గా పిలుస్తున్నారు.
ఇక వారాహి యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొన్ని హామీల్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీల్ని కూడా మేనిఫెస్టోలో చేర్చినట్టు సమాచారం. జవసేన షణ్ముఖ వ్యూహం, టీడీపీ సూపర్ సిక్స్‌తో కలిసి 12 అంశాలలో ఉమ్మడి మేనిఫెస్టో సిద్ధం కానుంది. సంక్రాంతి తరువాత అంటే మరో వారం రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Also read: MP Balashowry Vallabhaneni: వైసీపీకి మచిలీపట్నం ఎంపీ గుడ్‌బై.. జనసేనలో చేరుతున్నట్లు ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook