Anuradha Panchumarthi Wins MLC Elections: ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి సంబంధించిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్యే ఎన్నిక ఈరోజు జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ఏపీ అసెంబ్లీ మొదటి అంతస్తు కమిటీ హాల్ లో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నిజానికి ఈ ఎన్నికల ప్రక్రియ మధ్యాహ్నం రెండు గంటలకే పూర్తయింది కానీ నిబంధనల ప్రకారం నాలుగు గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రత్యేక చేపట్టకూడదు.
ఈ క్రమంలోనే సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టారు. అయితే ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పంచుమర్తి అనురాధ గెలుపొందినట్లు తెలుస్తోంది. అసలు ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేకపోయినా సరే చివరి నిమిషంలో ఆమెను అభ్యర్థిగా రంగంలోకి దింపింది తెలుగుదేశం.
ఏ అభ్యర్థి అయినా ఈ ఎన్నికల్లో గెలవాలంటే 22 ఓట్లు అవసరం. ఈ క్రమంలోనే టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు కోసం కూడా 22 ఓట్లు అవసరం అయ్యాయి. అయితే టీడీపీ గెలుచుకున్న ఎమ్మెల్యేల సంఖ్య 23, కానీ అందులో ఉన్న నలుగురు జగన్ కు జై కొట్టారు. ఈ క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీకి మద్దతిస్తున్న తరుణంలో ఆ పార్టీ బలం 19కి తగ్గిపోయింది.
దీంతో వైసీపీకి చెందిన నలుగురు మద్దతిస్తే తప్ప ఆమెకు 23 ఓట్లు వచ్చే అవకాశం లేదని, అయినా అనురాధకు 23 ఓట్లు వచ్చాయి అంటే వైసీపీ నుంచి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక మిగతా అందరికీ 22 ఓట్లు చొప్పున రావడంతో వారికి పడిన రెండో ప్రాధాన్యత ఓట్లను బట్టి ఓడింది ఎవరు అనేది తేలాల్సి ఉంది.
Also Read: Anushka Shetty Angry: ప్రభాస్ పై అనుష్క ఆగ్రహం.. ఆ విషయంలో హర్ట్ అవడంతో ఇక కలిసి నటించకూడదని నిర్ణయం?
Also Read: Rashmika Mandanna Photos: బ్లేజర్లో మెరిసిపోతున్న రష్మిక మందన్నా.. బటన్స్ విప్పేసి మరీ అందాల జాతర!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook