Ghattamaneni Adi Seshagiri Rao On Ycp: గత ఎన్నికల్లో తనకు పోటీ చేసేందుకు మనసు ఒప్పుకోలేదని.. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చాననని సూపర్ స్టార్ కృష్ణసోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తన రాజకీయ జీవితంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను 2019 వరకు వైసీపీలో పనిచేశానని.. చిన్న భేదాభిప్రాయం రావడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని చెప్పారు. తనకు ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి పోటీ చేయమని ఆఫర్ వచ్చిందని.. కానీ పోటీ చేయడం ఇష్టంలేక వద్దనని అన్నానని పేర్కొన్నారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సోదరి మనువరాలు తమ కోడలని తెలిపారు ఆదిశేషగిరిరావు. ఆయన బంధుత్వం ఉన్నందుకు అందరూ టీడీపీ వైపు మొగ్గుచూపుతున్నారని అంటున్నారని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో చెప్పానని కానీ.. ఎప్పుడు యాక్టివ్‌గా పనిచేయలేదన్నారు. ఆ పార్టీ వాళ్లు కూడా తనతో చేయించుకున్నదీ లేదన్నారు. ఇక తనకు ఎన్నికల్లో పోటీచేయాలని లేదని.. అలాగని పూర్తిగా చేయకూడదని కాదు ఏదైనా పర్లేదన్నారు. కానీ యాక్టివ్‌గా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలకు విలువలేదని.. ఢిల్లీలో కనీసం విలునివ్వడం లేదన్నారు.
ఘట్టమనేని ఫ్యామిలీకి కాంగ్రెస్ పార్టీతో ఎప్పటి నుంచే అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ట కాంగ్రెస్ పార్టీ నుంచే ఎంపీగా గెలిచారు. ఆదిశేషగిరిరావు కూడా కాంగ్రెస్‌లోనే కొనసాగారు. వైఎస్సార్‌తో ఆయనకు మంచి సంబంధాలు ఉండేవి. వైసీపీ ఏర్పడిన తరువాత ఆ పార్టీలో చేరారు. అయితే 2019 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ తరువాత టీడీపీలో చేరినా.. రాజకీయంగా పెద్దగా యాక్టివ్‌గా లేరు.
ఇటీవల తన సోదరుడు కృష్ణ మరణంతో ఆదిశేషగిరిరావు తీవ్ర విషాదంలో ఉన్నారు. అన్న ప్రోత్సాహంతో సినీ ఇండస్ట్రీకి వచ్చి.. ప్రొడ్యూసర్‌గా మారి ఎన్నో విజయవంతమైన సినిమాలను ఆయన నిర్మించారు. సూపర్ స్టార్ కృష్ణ గురించి కూడా అనేక విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
Also Read: Hyderabad Cold Updates: ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. హైదరాబాద్‌ను వణికిస్తున్న చలి!
Also Read: TS Eamcet: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి ఫ్రీఎంసెట్ కోచింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి