తెలంగాణకు రెయిన్ అలెర్ట్ : ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు

ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు

Last Updated : Aug 23, 2018, 01:09 PM IST
తెలంగాణకు రెయిన్ అలెర్ట్ : ఇవాళ, రేపు తెలంగాణలో వర్షాలు

ఇవాళ, రేపు తెలంగాణలో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్య మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం కొనసాగుతుండటంతోపాటు ఉత్తర మధ్యప్రదేశ్‌లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... ఫలితంగా ఈనెల 26న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇదిలావుంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉభయ గోదావరి జిల్లాల్లో లంక గ్రామాలు పూర్తి జలదిగ్బందంలోనే ఉన్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలు లేకుండా రహదారులు తెగిపోయాయి. 

నిన్న బుధవారం ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీక్యాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించారు. వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన బాధితులను ప్రభుత్వం అన్నివిధాల ఆదుకుంటుందని ఈ సందర్భంగా చంద్రబాబు హామీ ఇచ్చారు. 
 

Trending News