Minister Gudivada Amarnath: చంద్రబాబు జైల్లో ఉన్నాడన్న బాధ ఆయన కుటుంబ సభ్యులలో ఎక్కడా కనిపించడం లేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. లోకేష్ విహార యాత్రలో ఉన్నాడని.. బాలయ్య సినిమా రిలీజ్ సందడిలో ఉన్నాడని.. చంద్రబాబు భార్య, కోడలు బిజినెస్‌లో బిజీగా ఉన్నారని అన్నారు. విధిలేని పరిస్థితుల్లో అక్కడక్కడ పార్టీ కార్యకర్తలు బయటికి వచ్చి మొక్కుబడిగా ఆందోళన చేసి వెళ్లిపోతున్నారని ఆయన విమర్శించారు.
ముసలాయన దసరా పండుగను ఈసారి రాజమండ్రి జైలులో చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు మంత్రి గుడివాడ. గత నాలుగున్నర నాలుగున్నర సంవత్సరాలలో చంద్రబాబు ఒక్క పండుగనైనా ఆంధ్రప్రదేశ్‌లో చేసుకున్నాడా..? అని ప్రశ్నించారు. కనీసం ఈసారైనా దసరా పండుగను ఆయన మన రాష్ట్రంలో చేసుకుంటున్నందుకు ఆనందంగా ఉందని చెప్పారు. వచ్చే ఎన్నికలు స్థానికులకు స్థానికేతరులకు మధ్య జరగనున్నాయని.. జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం తథ్యమని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఎన్ని యాత్రలు చేసినా టీడీపీకి అధికారం దక్కదని స్పష్టం చేశారు.
వందల కోట్ల రూపాయలు కాజేసి దొరికిపోయిన చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని ఆయన అన్నారు. చంద్రబాబు జైలుకు వెళ్లే ముందు 66 కేజీల బరువు ఉన్నారని ఇప్పుడు 67 కేజీలకు పెరిగారని, అందువల్ల ఆయనను ఇంట్లో కన్నా జైల్లోనే బాగా చూసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించక తప్పదన్న మంత్రి.. 70 ఏళ్ల వయసున్న చంద్రబాబును అరెస్టు చేయడాన్ని కొంతమంది విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ వయసులో ఉన్నాయన ఆర్థిక నేరాలకు పాల్పడడం సరైనదేనా..? అని ప్రశ్నించారు. చేసిన తప్పును విచారించి న్యాయస్థానాలు తగిన తీర్పును ప్రకటిస్తాయని చెప్పారు. చంద్రబాబు అరెస్టు విషయంలో రాజకీయాలకు తావు లేదన్నారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని మంత్రి తెలిపారు. గురువారం తాళ్లపాలెం, కొత్తూరు, అనకాపల్లి పట్టణంలోని నెయ్యల వీధిలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందితో మాట్లాడారు. తాళ్లపాలెంలో ఈ ఒక్కరోజు 400 మందికి పైగా ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అలాగే కొత్తూరులో 255 మంది, నెయ్యల వీధిలో 113 మంది వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలోనూ ఇంత పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు నిర్వహించిన దాఖలాలు లేవని, ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటువంటి శిబిరాలను ఏర్పాటు చేసి ఎంతోమందికి స్వస్థత చేకూరుస్తున్నారని మంత్రి గుడివాడ చెప్పారు. ఈ శిబిరాలను గ్రామస్తులు, పట్టణవాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: IND vs BAN Highlights: కోహ్లీ మెరుపు సెంచరీ.. బంగ్లాపై టీమిండియా ఘన విజయం..
ఇది కూడా చదవండి: Lava Blaze Pro 5G Price: బంఫర్ ఆఫర్ మీ కోసం..Lava Blaze 5G మొబైల్‌పై రూ.9,400 వరకు తగ్గింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook