KA Paul comments on Pawan Kalyan | తిరుపతి: తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించిన తర్వాత ఎమ్మెల్యేగా కానీ లేదా ఎంపీగా కానీ గెలవకుండానే ఏడు పార్టీలు మారారంటూ కేఏ పాల్ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌ని బీజేపీకి ఏజెంట్‌గా అభివర్ణించిన కేఏ పాల్.. నువ్వు బీజేపీ ఏజెంట్‌వి కాకపోతే తిరుపతిలో కచ్చితంగా పోటీ చేసేవాడివే అని మండిపడ్డారు. '' పవన్ కళ్యాణ్ తమ్ముడికి అతని ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా చెప్పండి అంటూ ఎద్దేవా చేసిన కేఏ పాల్.. ఇదేం విచిత్రమో కానీ ఇప్పటికే పవన్ కల్యాణ్ ఏడు పార్టీలు మార్చారని అన్నారు.
మీ ఒరిజినల్ పార్టీ ప్రజారాజ్యం పార్టీ.. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తరువాత సీపీఐకి జైకొట్టి, సీపీఎంకి జై కొట్టి.. అనంతరం బీఎస్పీ అధినేత్రి మాయావతి కాళ్లపై పడ్డావ్ తమ్ముడూ.. అవన్నీ పక్కనపెట్టి మళ్లీ ఇప్పుడు బీజేపీ అంటున్నావు అని పవన్ కల్యాణ్‌ను పాల్ ఎద్దేవా చేశారు. మొన్న తెలంగాణలో పోటీ చేస్తా అని ప్రకటించావు. ఆ తరువాత పోటీ చేయను అని చెప్పి బీజేపీకి మద్దతు ప్రకటించావు. ఇవన్నీ గమనిస్తున్న తెలుగు ప్రజలు మూర్ఖులు కాదు అంటూ పవన్ కల్యాణ్‌కి హితవు పలికారు.
Also read : AP: రాష్ట్రంలో మత సామరస్య కమిటీల ఏర్పాటు, జీవో నెంబర్ 6 విడుదల
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా కేఏ పాల్ విమర్శలు..
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపైనా వ్యక్తిగత విమర్శలు చేసిన కేఏ పాల్.. '' నా భార్య క్రిస్టియన్.. నా కూతురు క్రిస్టియన్ అని చెప్పుకునే నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం లేదా అని ప్రశ్నించారు. ఎక్కడ నుంచో తెచ్చుకున్న భార్యని క్రైస్తవురాలు అని చెప్పుకుంటావా అని ప్రశ్నించిన కేఎ పాల్.. అసలు నీకు నీతి, నిజాయితీ, నీ ఫ్యాన్స్ మీద గౌరవం ఉన్నట్టయితే.. నిజంగా ప్రజా సేవ చేయాలి అని భావించినట్టయితే.. నువ్వు తిరుపతి ఉప ఎన్నికల బరిలో దిగి పోటీ చేయాలని సవాల్ విసిరారు. నువ్వు బీజేపీకి ఏజెంట్‌వి కాదని రుజువు చేసుకోవాలనుకుంటే.. నువ్వు కానీ, లేదా మీ అన్న కానీ పోటీలో నిలబడాలని.. మీకు కుదరకపోతే నీ పార్టీకి సంబంధించిన ఏ వ్యక్తినైనా బరిలో నిలబెట్టాలని పవన్ కల్యాణ్‌కు ( Pawan Kalyan ) కేఏపాల్ డిమాండ్ చేశారు.
నాతో పాటు చాలా మంది మద్దతు ఇస్తారు..
తిరుపతి ఉప ఎన్నికలో ( Tirupati bypolls ) జనసేన పార్టీ పోటీ చేస్తే... మీకు చాలా మంది మద్దతు ఇస్తారని.. అంతెందుకు నాకు ఫోన్ చేస్తే నేనే మద్దతిస్తానని కే.ఏ. పాల్ ( KA Paul ) వ్యాఖ్యానించారు.
Also read : AP: యూకే స్ట్రెయిన్‌పై ఏపీ అప్రమత్తం, కొత్తగా మార్గదర్శకాలు జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook