Fake ips controversy in deputy cm pawan kalyan tour: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి సర్కారు ప్రస్తుతం ప్రజలకు డెవ్ లప్ మెంట్ పథకాలు అందజేస్తు.. ఏపీని మరల గాడినపెట్టే పనుల్లో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లు ప్రజలకు అందుబాటులో ఉంటునే..మరోవైపు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. నేరుగా ప్రజలవద్దకు వెళ్లి అనేక పనుల్ని సైతం గమనించి.. ప్రజల్ని ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు.
ఈనేపథ్యంలో విజయవాడలో ఇటీవల వరదలు సంభవించినప్పుడు కూడా.. సీఎం చంద్రబాబు నేనున్నానని.. అక్కడికి చేరుకుని ప్రజలకు భరోసా ఇచ్చి, సహాయక చర్యల్ని ముమ్మరంగాసాగేలా చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇటీవల విజయనగరం జిల్లాలో పర్యటించినట్లు తెలుస్తొంది. అసలే.. సున్నితమైన ప్రదేశం కావడంతో పోలీసులు ముందుగానే.. భద్రత విషయంలో అనేక సూచనలు చేసినట్లు సమాచారం.
కానీ పవన్ కళ్యాణ్ మాత్రం.. వెనక్కు తగ్గలేదని తెలుస్తొంది. ఆయన సాలురు, మక్కువ మండలం బాగోజాలలో పర్యటించారు. అయితే..అక్కడ ఒక ఐపీఎస్ అధికారి దుస్తులు వేసుకుని ఒక వ్యక్తి ఆయన చుట్టు తిరిగినట్లు తెలుస్తొంది. తీరా అధికారులు ఆరా తీయడంతో అతను ఫెక్ అని బైటపడింది.
పర్యటన అనంతరం కింది స్థాయి సిబ్బందితో ఫోటోలుకు ఫోజులు ఇచ్చాడు. అధికారులు కూడా అతను నిజమైన ఐపీఎస్ అనుకున్నారు. కానీ అతని వాలకం అనుమానంగా ఉండటంతో పోలీసులు విచారణ చేపట్టి.. అతడు నకిలీ ఐపీఎస్ అని తెల్చినట్లు తెలుస్తొంది.
Read more: Tirumala: ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త.. సిపారసు లేఖల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం..
వెంటనే విజయనగరం రూరల్ పోలీసులు ఫెక్ ఐపీఎస్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది. సదరు వ్యక్తి.. గరివిడి మండలానికి చెందిన బలివాడ సూర్య ప్రకాష్ అనే వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తొంది. హోంమంత్రి వంగలపూడి అనిత సైతం.. తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసినట్లు తెలుస్తొంది. దీనిలో ఏదైన కుట్ర కోణం ఉందా.. అన్న యాంగిల్ లో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter