బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ప్రమాదం పొంచి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం..తుపానుగా మారనుందనే హెచ్చరికలు వస్తున్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2021, 10:51 AM IST
బంగాళాఖాతంలో అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం

Cyclone Alert: బంగాళాఖాతంలో తుపాను ప్రమాదం పొంచి ఉంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం..తుపానుగా మారనుందనే హెచ్చరికలు వస్తున్నాయి. 

పశ్చిమ బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం కేంద్రంగా మరో 24 గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని వాతావరణ శాఖ (IMD)హెచ్చరిస్తోంది. రానున్న 48 గంటల్లో ఈ ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారే అవకాశాలున్నాయి. ఈ ప్రభావంతో ఉత్తర కోస్తా, కృష్ణా జిల్లాల్లో ఈ నెల 17వ తేదీ వరకూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాంధ్ర తీరంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో(Bay of Bengal) ఉపరితల ఆవర్తనం సముద్రమట్టం నుంచి 3.1 కిలోమీటర్ నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో దక్షిణం వైపుకు ఉంది. ఈ ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఐఎండీ వెల్లడించింది. రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడవచ్చని తెలుస్తుండటంతో సహాయక యంత్రాంగాన్ని అధికారులు అప్రమత్తం చేశారు. అల్పపీడనం ప్రభావంతో 17వ తేదీ వరకూ తూర్పు తీరంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వర్షాలు(Heavy Rains) పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Also read: ఆ అనాధ పిల్లల చదువుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News