ఏపీలో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానం అమలు, ఎంపికైన స్కూళ్ల వివరాలు ఇవీ

CBSE System: ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులు చేస్తోంది. ఓ వైపు ఇంగ్లీషు మీడియం మరోవైపు సీబీఎస్ఈ విధానంతో సంస్కరణలు చేపడుతోంది. అన్నీ పూర్తయితే విద్యా వ్యవస్థ స్వరూపమే మారనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 21, 2021, 07:22 AM IST
  • ఏపీలో సీబీఎస్ఈ విధానం 8వ తరగతి నుంచి అమలు
  • రాష్ట్రవ్యాప్తంగా 1 వేయి 92 స్కూళ్లు సీబీఎస్ఈకు ఎంపిక
  • అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 137 స్కూళ్లు
ఏపీలో 8వ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానం అమలు, ఎంపికైన స్కూళ్ల వివరాలు ఇవీ

CBSE System: ప్రభుత్వం పాఠశాల విద్యలో సమూల మార్పులు చేస్తోంది. ఓ వైపు ఇంగ్లీషు మీడియం మరోవైపు సీబీఎస్ఈ విధానంతో సంస్కరణలు చేపడుతోంది. అన్నీ పూర్తయితే విద్యా వ్యవస్థ స్వరూపమే మారనుంది.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)ప్రభుత్వం ఏర్పడిన తరువాత విద్యా వైద్య వ్యవస్థలో సమూల మార్పులకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను కార్పొరేట్ స్కూళ్ల స్థాయిలో మౌళిక సదుపాయాలు కల్పిస్తూ తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో సీబీఎస్ఈ విధానం అమలు చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. విద్యావ్యవస్థలో సమూల మార్పుల కోసం సీబీఎస్ఈ విధానం ప్రవేశపెట్టాలనేది ముఖ్య ఉద్దేశ్యం. భవిష్యత్‌లో విద్యార్ధులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరీక్షల్ని ఎదుర్కోవల్సిన పరిస్థితి ఉన్నందున సీబీఎస్ఈ విధానం తప్పనిసరిగా ప్రభుత్వం భావించింది. 

రాష్ట్రంలో సీబీఎస్ఈ విద్యా విదానం(CBSE System) కోసం తొలి విడతలో ప్రభుత్వంలోని 10 విభాగాల పరిధిలో ఉన్న వివిధ స్కూళ్లు ఎంపికయ్యాయి. ఈ స్కూళ్లలో నిరుపేద, అనాధ బాలికలు విద్యనభ్యసిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తర్వాత ఏపీ మోడల్‌ స్కూళ్లు, వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నడిచే గురుకుల స్కూళ్లు, మున్సిపల్‌ స్కూళ్లు, జెడ్పీ, ప్రభుత్వ స్కూళ్లను ఎంపిక చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి స్కూళ్లు ఎంపికయ్యాయి. అనంతపురం నుంచి 137 స్కూళ్లు ఎంపిక కాగా, రెండవ స్థానంలో కర్నూలు నుంచి 128 స్కూళ్లున్నాయి. మూడవ స్థానంలో ప్రకాశం జిల్లా నుంచి 94 ఉన్నాయి.

రాష్ట్రంలో ఇప్పటివరకూ సీబీఎస్ఈ నిబంధనలకు(CBSE Rules) అనుగుణంగా 1 వేయి 92 పాఠశాలలు ఎంపికయ్యాయి. 2024-25 విద్యా సంవత్సరం నుంచి సీబీఎస్ఈ విధానంలో పదవ తరగతి పరీక్షలు జరిగేలా ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే వివిధ స్కూళ్ల అనుబంధ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ విద్యా సంవత్సరంలో ఏడవ తరగతి నుంచి సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని తొలుత భావించినా..సాధ్యం కాలేదు. అందుకే 8వ తరగతి నుంచి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

Also read: చంద్రబాబు-భువనేశ్వరిలకు మద్దతుగా కల్యాణ్ రామ్, నారా రోహిత్ రియాక్షన్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Trending News