Dead Body in MLC Car: సంతకం పెట్టాలని కొడుతున్నారు.. పోలీసులపై మృతుడి భార్య సంచలన ఆరోపణలు

Dead Body in MLC Car: ఎమ్మెల్సీ అనంత బాబు కారులో డెడ్ బాడీ ఘటనలో పోలీసులపై మృతుడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులు తనను కొడుతున్నారంటూ వాయిస్ మెసేజ్ విడుదల చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 21, 2022, 07:45 PM IST
  • ఎమ్మెల్సీ అనంత బాబు కారులో మృతదేహం
  • సంచలనం రేకెత్తిస్తోన్న ఘటన
  • మృతుడు సుబ్రహ్మణ్యం మృతదేహానికి పోస్టుమార్టమ్ నిరాకరిస్తున్న కుటుంబ సభ్యులు
  • తాజాగా పోలీసులపై సుబ్రహ్మణ్యం భార్య సంచలన ఆరోపణలు
Dead Body in MLC Car: సంతకం పెట్టాలని కొడుతున్నారు.. పోలీసులపై మృతుడి భార్య సంచలన ఆరోపణలు

Dead Body in MLC Car: వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్‌ కారులో సుబ్రహ్మణ్యం అనే యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. ఇది ముమ్మాటికీ హత్యేనని.. అనంత బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని మృతుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అనంత బాబును అరెస్ట్ చేసేంతవరకూ మృతదేహాన్ని పోస్టుమార్టమ్‌కు అప్పగించేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యం భార్య అనిత తాజాగా పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు.

సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని పోస్టుమార్టానికి అప్పగించాలంటూ పోలీసులు తనపై ఒత్తిడి తెస్తున్నారని అనిత ఆరోపించారు. పోస్టుమార్టమ్‌కు అనుమతిస్తూ సంతకం పెట్టాలంటూ మహిళా పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. అనిత తన కుటుంబ సభ్యులకు పంపించిన వాయిస్ మెసేజ్‌లో ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనిత, సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు పోలీసుల అదుపులోనే ఉన్నారు. హత్య చేసిన అనంత బాబును అరెస్ట్ చేయకుండా మృతుడి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడమేంటని హైకోర్టు న్యాయవాది శ్రవణ్ కుమార్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఈ వ్యవహారంపై కాకినాడ జీజీహెచ్ వైద్యులు మాట్లాడుతూ.. మృతదేహాన్ని ఐదు రోజులు మాత్రమే ఫ్రీజర్‌లో ఉంచగలమని అన్నారు. శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నందునా మృతదేహం త్వరగా కుళ్లిపోయే అవకాశం ఉందని... నాలుగు రోజుల లోపే పోస్ట్‌మార్టమ్ చేయాలని పేర్కొన్నారు. అటు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మాత్రం అనంత బాబును అరెస్ట్ చేస్తేనే పోస్టుమార్టమ్‌కు అనుమతిస్తామని తెగేసి చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేయాలో తెలియక పోలీసులు సతమతమవుతున్నారు.

అసలేం జరిగింది... :

ఎమ్మెల్సీ అనంత బాబు తన కారులో సుబ్రహ్మణ్యం అనే యువకుడి మృతదేహాన్ని అతని ఇంటికి తరలించాడు. బైక్ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం మృతి చెందాడని... మృతదేహాన్ని అప్పగించేందుకు వచ్చామని కుటుంబ సభ్యులతో చెప్పాడు. అనంత బాబు అక్కడి నుంచి తిరిగి వెళ్తుండగా సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు అడ్డుపడ్డారు. దీంతో అనంత బాబు కారు వదిలి పరారయ్యాడు. గురువారం (మే 19) రాత్రి 10.30 గంటల సమయంలో అనంత బాబు తమ ఇంటికొచ్చి సుబ్రహ్మణ్యంను కారులో తీసుకెళ్లాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అనంత బాబే సుబ్రహ్మణ్యంను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

Also Read: CM Kcr Tour: త్వరలో కీలక పరిణామం..ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్య..!

Also Read: Vijay Deverakonda: విజయ్‌తో రొమాన్స్ చేయాలనుంది... మనసులో మాట బయటపెట్టిన స్టార్ హీరోయిన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News