First Bird Flu Case: చికెన్,గుడ్ల నుంచి కొన్ని రోజులు దూరం పాటించండి. ఊహించినట్టే బర్డ్ ఫ్లూ మనుషులకు వ్యాపించేసింది. ఏపీలో బర్డ్ ఫ్లూ కారణంగా వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్టు నిర్ధారణ అయింది. ఏలూరు జిల్లా వైద్యాధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు.
ఏపీలోని పలు జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. పెద్ద సంఖ్యలో వేలాదిగా కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృత్యువాత పడుతున్నాయి. అందుకే కొన్ని ప్రాంతాల్లో చికెన్, గుడ్లు తినవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ క్రమంలో ఏలూరు జిల్లా ఉంగుటూరులోని కోళ్ల ఫారంకు సమీపంలో ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కన్పించడంతో చుట్టుపక్కల కలకలం రేగింది. సంబంధిత పరీక్షలు చేయగా బర్డ్ ఫ్లూ అని నిర్ధారణ అయింది. ఏలూరు జిల్లా వైద్య శాఖ అధికారిణి డాక్టర్ మాలిని ఈ విషయాన్ని ధృవీకరించారు. తొలి కేసు నమోదైన ప్రాంతంలోనూ, చుట్టుపక్కల వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. చికిత్సకు అన్ని చర్యలు తీసుకున్నామని ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
ఇక ఇదే జిల్లా పరిధిలోని బాదంపూడిలో కిలోమీటర్ వరకు ఇన్‌ఫెక్టెడ్ జోన్, 10 కిలోమీటర్ల వరకు సర్వైలెన్స్ జోను ఏర్పాటు చేశారు. ఇన్‌ఫెక్టెడ్ జోన్‌లో అయితే ఫారం కోళ్లు, నాటు కోళ్లను పూర్తిగా చంపి ఖననం చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. తూర్పు గోదావరి జిల్లా కానూరు అగ్రహారంలో చికెన్ షాపుల్ని పూర్తిగా మూసివేశారు. గుడ్ల అమ్మకాలు కూడా భారీగా తగ్గిపోయాయి.
Also read: Pawan Kalyan Temple Visit: ఇవి నాలుగేళ్ల నాటి వ్యక్తిగత మొక్కులు, పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి