Moderate Rains likely to hit AP for next 3 days due to Low Pressure: దక్షిణ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రంలో నెలకొన్న అల్పపీడనం పశ్చిమ దిశగా కొనసాగుతోంది. రానున్న మూడు రోజుల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్యంగా పయనించి.. పొరుగు దేశం శ్రీలంక దిశగా రానున్నదని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడన ప్రభావంతో మంగళవారం (డిసెంబర్ 20) నుంచి తమిళనాడు తీర ప్రాంత జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.
అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం నుంచి వీస్తున్న తూర్పు గాలులతో ఆదివారం (డిసెంబర్ 18) దక్షిణ కోస్తాలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఇక రానున్న మూడు రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ఇక రానున్న 24 గంటల్లో దక్షిణకోస్తా, రాయలసీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని.. ఉత్తరకోస్తాలో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
ఏపీలో పగటి సమయాల్లో కాస్త ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండనున్నాయని ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది. అయితే రాత్రి సమయాల్లో బాగా చలిగా ఉండే చాన్స్ ఉందని చెప్పింది. ఇక ఏజెన్సీ ప్రాంతాలను ఉదయం మంచు కప్పేస్తుంది. కోస్తా, రాయలసీమలోని పలుచోట్ల చలి ప్రభావం కొనసాగుతోంది. ఆదివారం కడపలో 18.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయింది. ఇక తెలంగాణాలో కూడా చలి ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
రానున్న మూడు రోజులకు వాతావరణం:
ఉత్తర కోస్తా, యానాంలో ఆది, సోమ, మంగళవారం పొడి వాతావరణం
దక్షిణ కోస్తాలో తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు
Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.