Kodali Nani: ఏపీలో రాజకీయ దుమారం రేగుతోంది. పొత్తుల విషయమై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు తీవ్రమౌతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని..పవన్, లోకేశ్‌లకు సవాలు విసిరారు.
ఏపీలో ఎన్నికలకు మరో రెండేళ్లున్నా అప్పుడే పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష పార్టీల పొత్తుల వ్యవహారంలో అధికార పార్టీ వ్యూహం ప్రకారం విమర్శలు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపధ్యంలో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు తీవ్రం చేసింది. ఏపీలో ఏర్పడిన పొత్తు రాజకీయాలపై మాజీ మంత్రి కొడాలి నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చి పడినా..సింహం జగన్ సింగిల్‌గానే వస్తున్నారని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, నారా లోకేశ్‌లు ముందు ఎమ్మెల్యేలుగా గెలవాలని సవాలు విసిరారు. జనసేన, టీడీపీలపై కొడాలి నాని విరుచుకుపడ్డారు. ఎన్ని పార్టీలు గుంపులుగా వచ్చినా..చెల్లాచెదురు చేసేందుకు సింహం రెడీగానే ఉందని చెప్పారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలని చెప్పారు. జగన్‌కు వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెబుతున్న చంద్రబాబుకు..అదే నిజమైతే మరో పార్టీ అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు.
మరోవైపు పవన్ కళ్యాణ్‌పై కూడా విమర్శలు గుప్పించారు. ముందు నుంచీ పవన్ కళ్యాణ్..చంద్రబాబు కోసమే దొంగచాటుగా పనిచేస్తూ వస్తున్నారని విమర్శించారు. అసలు జనసేన పార్టీ స్థాపించింది కూడా చంద్రబాబు కోసమేనని విమర్శించారు. జగన్ కోటాలో 55 శాతం ఓట్లు కచ్చితంగా చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు. ఈసారైతే చంద్రబాబును సైతం ఓడిస్తామన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు 2024 ఎన్నికలు చివరివని స్పష్టం చేశారు.
Also read: Alliance Politics: చంద్రబాబు ముసుగే పవన్ కళ్యాణ్, మంత్రి పెద్దిరెడ్డి విమర్శలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook