Antarvedi New Chariot: విజయవంతమైన అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్

Antarvedi New Chariot: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం కొత్త రధం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా తయారైన కొత్త రధం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు.

Last Updated : Jan 24, 2021, 07:26 PM IST
Antarvedi New Chariot: విజయవంతమైన అంతర్వేది నూతన రథం ట్రయల్ రన్

Antarvedi New Chariot: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అంతర్వేది ఆలయం కొత్త రధం సిద్ధమైంది. సర్వాంగ సుందరంగా తయారైన కొత్త రధం ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది ( Antarvedi ) లక్ష్మీ నరశింహ స్వామి ఆలయం గురించి అందరికీ తెలిసిందే. విశిష్టమైన ఈ ఆలయంలోని రధాన్ని గుర్తు తెలియని దుండగులు దగ్దం చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ( Ap Government ) సీఐడీ విచారణకు..తరువాత సీబీఐ దర్యాప్తు ( CBI Probe ) కు సిఫారసు చేసింది. దగ్దమైన రధం ( Chariot burn ) స్థానంలో కొత్త రధాన్ని సర్వాంగ సుందరంగా నిర్మిస్తామని ప్రకటించింది. చెప్పినట్టుగా అంతర్వేది ఆలయం కొత్త రధం ( Antarvedi temple new chariot ) సిద్దమైంది. ప్రత్యేకమైన కలపతో ఐదు అంతస్థుల్లో రధాన్ని నిర్మించారు. 

ఇవాళ కొత్త రధం ట్రయల్ రన్ ( Antarvedi new chariot trial run ) నిర్వహించారు. మంత్రి వేణుగోపాల కృష్ణ రధం బ్రేకులు, జాకీలను పరిశీలించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( Ap cm ys jagan ) ఆదేశాల మేరకు తక్కువ సమయంలోనే నూతన రథాన్ని తయారు చేయించామని మంత్రి వేణుగోపాల కృష్ణ తెలిపారు. దేవుళ్లు, ఆలయాలపై ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. అంతర్వేది రథం దగ్దమైన ఘటనపై విచారణను సీబీఐకు అప్పగించామని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్నించి ప్రజల దృష్టి మరల్చేందుకే ప్రతిపక్షాలు దుష్ట రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. 

Also read: AP Panchayat Elections 2021: పంచాయితీ ఎన్నికల కేసులో..సుప్రీంకోర్టులో మారిన బెంచ్, సర్వత్రా ఆసక్తి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News