Weather Report: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విచిత్ర వాతావరణం నెలకొంది. కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన ఎండ వేడిమి ఉండగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నట్టుండి వాతావరణం చల్లగా మారిపోతుంది. ఒక్కసారిగా దట్టమైన మబ్బులు కమ్ముకుని వర్షం కురుస్తోంది.
రాష్ట్రంలోని పలు చోట్ల జనాలను ఎండ, వాన రెండూ ఒకేసారి పలకరిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో జనాలు కాస్త సేద తీరారు. దీనికి ఉపరితల ద్రోణుల విస్తరణే కారణమని వాతావారణ అధికారులు తెలిపారు.రాయలసీమ నుంచి కోస్తా మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకూ ఉపరితల ద్రోణులు విస్తరించాయని అధికారులు వెల్లడించారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
అలాగే బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకూ వేర్వేరుగా ఉపరితల ద్రోణులు విస్తరించినట్లు పేర్కొన్నారు. ఈ ద్రోణుల ప్రభావంతో కోస్తా, రాయలసీమలో పలు చోట్ల చిరుజల్లులు పడతాయని, మిగిలిన చోట్ల ఎండ తీవ్ర ఉంటుందని చెప్పారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకటి నుంచి మూడు డిగ్రీలు పెరిగినట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..
ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.