Vishwaroop Comments: కోనసీమ అల్లర్ల వెనుక ఆ పార్టీల హస్తం..మంత్రి విశ్వరూప్‌ హాట్ కామెంట్స్..!

Vishwaroop Comments: కోనసీమ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న ఆందోళనకారుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ కొనసాగుతోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 25, 2022, 05:54 PM IST
  • కోనసీమ జిల్లాలో హై అలర్ట్
  • కొనసాగుతున్న 144 సెక్షన్‌
  • ఇంటిని పరిశీలించిన మంత్రి విశ్వరూప్
Vishwaroop Comments: కోనసీమ అల్లర్ల వెనుక ఆ పార్టీల హస్తం..మంత్రి విశ్వరూప్‌ హాట్ కామెంట్స్..!

Vishwaroop Comments: కోనసీమ జిల్లాలో హై అలర్ట్ కొనసాగుతోంది. నిన్న ఆందోళనకారుల నిరసన హింసాత్మకంగా మారడంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్‌ కొనసాగుతోంది. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలో తన ఇంటిని మంత్రి విశ్వరూప్ పరిశీలించారు. కుటుంబసభ్యులతో కలిసి తన ఇంటిని పరిశీలించారు. మంత్రి విశ్వరూప్ ఇంటితోపాటు స్థానిక ఎమ్మెల్యే సతీష్‌ ఇంటికి నిన్న ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఘటనలో మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లు పూర్తిగా దగ్ధమైయ్యాయి.

కోనసీమ జిల్లా అమలాపురంలో ఆందోళనలు జరగడం దురదృష్టకరమన్నారు మంత్రి విశ్వరూప్. అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. కోనసీమ సాధన సమితి ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. కొందరూ కావాలనే రెచ్చగొట్టి..విధ్వంసాన్ని సృష్టించారని మండిపడ్డారు. ఇందులో టీడీపీ, జనసేన హస్తం ఉందన్నారు. వారి కార్యకర్తలను అదుపు చేయడంలో ఆ పార్టీ నేతలు విఫలమైయ్యారని చెప్పారు. 

నిరసనకారుల ఆందోళనల్లో రౌడీ షీటర్లు చొరబడ్డారని విమర్శించారు. తన ఇంటికి నిప్పు పెట్టింది వారేనని ఆరోపించారు. కోనసీమ ప్రాంతంలో గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటనను కోనసీమ సాధన సమితి బాధ్యత తీసుకోవాలని మంత్రి విశ్వరూప్‌ తెలిపారు. అందరి అభిష్టం మేరకే కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామాకరణం చేశామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించుకోవాలన్నారు. 

హింసాత్మక ఘటనలో ఇప్పటివరకు 46 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. మిగిలిన వారిని విచారిస్తున్నామన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించబోమని..నిందితులకు కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని తెలిపారు.

Also read:Jos Buttler IPL Record: జోస్ బట్లర్‌ రేర్ రికార్డు.. ఒకే సీజన్‌లో..!

Also read:CM Kcr Tour: రేపు తెలంగాణకు ప్రధాని..బెంగళూరుకు కేసీఆర్.. ఏం జరుగుతోంది..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News