Independence Day Gift to Women: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇండిపెండెన్స్ డే సందర్భంగా మహిళలకు ప్రత్యేక నజరానా అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళకు భారీగా ఆర్ధిక సహాయం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. రుణ పరిమితిని ఏకంగా 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దాంతో రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు పెద్దమొత్తంలో డబ్బులు అందనున్నాయి.
ఏపీలో స్త్రీ నిధి పథకంలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే రుణ పరిమితిని 5 లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణ పరిమితి పెంచడం మహిళలకు అతి పెద్ద రిలీఫ్ కానుంది. స్త్రీ నిధి లోన్ పరిమితిని ఈ ఆర్ధిక సంవత్సరం నుంచే పెంచుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. 10 వేల నుంచి 5 లక్షలకు పరిమితి పెరిగింది. తద్వారా ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే 5.5 లక్షలమంది మహిళలకు లబ్ది చేకూరనుంది. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది వరకూ మహిళలు ప్రయోజనం పొందనున్నారు.
దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. ఏ,బీ, సీ, డీ గ్రేడ్లుగా విభజించి గ్రేడును బట్టి రుణ పరిమితి నిర్ణయించింది. ప్రతి గ్రామంలోని డ్వాక్రా సంఘానికి ప్రభుత్వం ఒక గ్రేడ్ ఇస్తుంది. స్త్రీ నిధిలో భాగంగా ఈ ఏడాది అంటే 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 170 కోట్లు కేటాయించింది. ప్రస్తుతం 8,812 గ్రూపులకు 60 కోట్ల రుణాలు అందించారు. మొత్తానికి ఇండిపెండెన్స్ డే పురస్కరించుకుని డ్వాక్రా మహిళలు పంట పండింది. 5 లక్షల వరకూ ఆర్ధిక సహాయ అందనుంది.
Also read: NEET UG 2024 Registration: నీట్ యూజీ కౌన్సిలింగ్ ప్రారంభం, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook