Ys jagan vs Modi: దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలు, ఏపీ సహా నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అటు ప్రతిపక్షాలు తెలుగుదేశం-బీజేపీ-జనసేన కూటమిగా ఏర్పడి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో తొలి బహిరంగ సభను చిలకలూరిపేటలో ఏర్పాటు చేశాయి. వైసీపీ అధినేత జగన్‌పై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేస్తారని భావించిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్‌కు తీవ్ర నిరాశే మిగిలింది.
సాధారణంగా ప్రధాని మోదీ ఏ రాష్ట్రంలో ఎన్నికల సభలో పర్యటించినా అక్కడి ముఖ్యమంత్రులు ప్రత్యర్ధి పార్టీ అయితే తీవ్రంగా విరుచుకుపడుతుంటారు. ఢిల్లీలో కేజ్రీవాల్, తమిళనాట స్టాలిన్, కేరళలో పినరయి విజయన్, తెలంగాణలో మొన్నటివరకూ కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డిలపై భారీగా విమర్శలు చేస్తుంటారు. దాంతో పవన్ కళ్యాణ్, చంద్రబాబులు ఇప్పుడు కూడా అదే ఆశించారు. కానీ ప్రధాని మోదీ మాత్రం తన ప్రసంగంలో ఎక్కడా జగన్‌పై విమర్శలు చేయలేదు. ఆయ చేసిన విమర్శలు రెండే రెండు..
ఒకటి వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒకటేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జగన్, షర్మిల ప్రయత్నిస్తున్నారని చెప్పారు. రెండవది ఏపీలో మంత్రుల అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలంటే కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ఇటు జగన్‌పై విమర్శలు చేయలేదు సరికదా రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి ఏమాత్రం ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు టీడీపీ-జనసేన శ్రేణుల్ని జీర్ణించుకోలేకుండా చేస్తోంది.
అసలు ఏపీలో ఎన్డీయే కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి సభలో మోదీ..జగన్‌పై విమర్శలు చేయకపోవడానికి రాజకీయ కారణాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ కేంద్ర ప్రభుత్వానికి వివిధ అంశాల్లో బేషరతుగా మద్దతిస్తూ వస్తున్నారు. ఎన్డీయేలో చేరేందుకు బీజేపీ అగ్రనేతలు ఆఫర్ ఇచ్చినా జగన్ తిరస్కరించిన పరిస్థితి. కానీ బీజేపీకు వివిధ అంశాల్లో మద్దతిస్తూనే ఉన్నారు. రానున్న ఎన్నికల్లో మెజార్టీ సర్వేలు వైసీపీదే అధికారమని అంచనా వేయడంతో పాటు కేంద్ర నిఘా సంస్థలు ఇచ్చిన నివేదికలో కూడా అదే ఫలితం ఉండటంతో జగన్ ప్రభుత్వంపై మోదీ విమర్శలు చేయలేదని తెలుస్తోంది.
మరోవైపు రాజ్యసభలో సరైన బలం లేని బీజేపీకు పూర్తిగా బలం కలిగిన వైసీపీ అవసరం ఎంతైనా ఉంది. రాజ్యసభలో వైసీపీ పూర్తి స్థాయిలో సభ్యుల్ని కలిగి ఉంది. అందుకే తెలుగుదేశం-జనసేన కూటమిలో చేరినా..ఏపీలో జగన్‌ను వదులుకునే సాహసం బీజేపీ చేయదని తెలుస్తోంది. అందుకే మోదీ ప్రసంగంలో జగన్‌పై విమర్శలు కన్పించలేదని సమాచారం.
Also read: YCP Bus Yatra: మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ భారీ బస్సు యాత్ర, రోజుకో సభ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook