AP Elections 2024: ఏపీలో నిన్న జరిగిన పోలింగ్ సరళి ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. నిన్న రాత్రి వరకూ చాలా పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. అర్ధరాత్రి వరకూ సాగిన పోలింగ్ అనంతరం అధికారికంగా ఇంకా ఎంతనేది వెల్లడించకపోయినా 80 శాతం వరకూ ఉంటుందనే అంచనా ఉంది. గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగిన ఓటింగ్ శాతం ఏ పార్టీకు అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకు ప్రతికూలంగా ఉంటుందనేది అంచనాకు అందడం లేదు.
ఏపీలో నిన్న జరిగిన పోలింగ్‌లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఇతర ప్రాంతాల్నించి భారీగా తరలివచ్చిన ఓటర్లతో పాటు మహిళలు, వృద్ధులు, పేదలు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో కన్పించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పించారు. చాలా చోట్ల గంటల తరబడి నిరీక్షించి మరీ ఓటేశారు. అర్ధరాత్రి వరకూ 78 శాతం పోలింగ్ దాటింది. ఇవాళ అన్ని ప్రాంతాల్నించి అందిన గణాంకాల ప్రకారం మొత్తం పోలింగ్ బ్యాలెట్ ఓటింగుతో కలుపుకుని 80 శాతం చేరవచ్చని తెలుస్తోంది.
వాస్తవానికి పోలింగ్ భారీగా ఉంటే ప్రభుత్వంపై వ్యతిరేకత అనేది సహజంగా అన్ని రాజకీయ పార్టీలు భావిస్తుుంటారు. కానీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పెరిగిన పోలింగ్ శాతం ప్రభుత్వ పాలనకు అనుకూలంగా ప్రజలు ఇచ్చిన తీర్పుగా పరిగణిస్తోంది. కచ్చితంగా 130 స్థానాలతో అధికారంలో వస్తామని చెబుతోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి, సంక్షేమ పధకాల లబ్దిదారులు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెబుతోంది. ఐదేళ్లుగా కులమతాలు చూడకుండా పార్టీలకు అతీతంగా అందించిన సంక్షేమం తమను గెలిపిస్తుందంటున్నారు వైసీపీ నేతలు.
అదే సమయంలో తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి మాత్రం ఉద్యోగులు, కార్మికులు, మధ్య తరగతి, ఎగువ మద్య తరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు భారీగా ఓట్లేసినట్టు చెబుతున్నారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసొస్తుందంటున్నారు. కచ్చితంగా పెరిగిన పోలింగ్ శాతం తమకే లాభిస్తుందంటున్నారు.
Also read: AP Poll Percentage: ఏపీలో అర్ధరాత్రి వరకూ 78 శాతం దాటిన పోలింగ్, ఏ జిల్లాలో ఎంత, ఎవరికి అనుకూలం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook