New Airports: కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా తెలుగు వ్యక్తి రామ్మోహన్ నాయుడు ఉండటంతో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కొత్త విమానాశ్రయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీలో ఆరు విమానాశ్రయాలు, తెలంగాణలో 4 విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో అధ్యయనం ప్రారంభమైంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, కడప, కర్నూలులో విమానాశ్రయాలున్నాయి. పుట్టపర్తిలో రన్ వే ఉంది. విజయనగరం జిల్లా భోగాపురంలో కొత్తగా అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది. ఇవి కాకుండా శ్రీకాకుళం, నాగార్జున సాగర్, తాడేపల్లి గూడెం, తుని, ఒంగోలు, కుప్పంలో కొత్తగా విమానాశ్రయాలు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూలత వ్యక్తం కావడంతో సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
ఏపీతో పోలిస్తే తెలంగాణలో ఎయిర్‌పోర్ట్‌లు లేవు. హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉంది. గతంలో వరంగల్‌లో చిన్న స్థాయి విమానాశ్రయం ఉన్నా 32 ఏళ్ల క్రితం అది కాస్తా మూతపడింది. ఇప్పుడు కొత్తగా ఈ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అదే మామునూరు విమానాశ్రయం. ఇప్పటికే ఎన్ఓసీ లభించింది. 8-10 నెలల్లో ఈ విమానాశ్రయాన్ని పూర్తి చేయాలనేది తెలంగాణ ప్రభుత్వ ఆలోచనగా ఉంది. ఇది కాకుండా అదనంగా రామగుండం, కొత్తగూడెంలో విమానాశ్రయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమౌతున్నాయి. బేగంపేట విమానాశ్రయంలో డొమెస్టిక్ విమాన సర్వీసులు ప్రారంభించాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది.
Also read: Anganwadi: ఏపీ ప్రభుత్వం బంపర్ బొనాంజా.. అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యూటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.