ఇస్లామాబాద్: 26/11 ముంబయి దాడి కుట్రలో ప్రధాన సూత్రధారి అయిన మెస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, జమాత్ ఉల్ దవా (JUD) సంస్థ చీఫ్ హఫీజ్ సయీద్‌కు పాకిస్తాన్ కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఉగ్రవాద దాడులకు ఊతమిచ్చేలా నిధులు సమకూర్చినట్టుగా నమోదైన రెండు వేర్వేరు కేసుల్లో పాకిస్థాన్ యాంటీ టెర్రరిజం కోర్టు ( Pakistan's Anti Terrorism Court ) హఫీజ్ సయీద్‌కి ఈ శిక్ష విధించింది. 2020లో హఫీజ్ సయీద్‌కి ఇది 4వ శిక్ష అవడం గమనార్హం. హఫీజ్ సయీద్‌తో పాటు మరో నలుగురు ఉగ్రవాదులకు పాకిస్తాన్ యాంటీ టెర్రరిజం కోర్టు జైలు శిక్ష విధించింది.
ఉగ్రవాద సంస్థలకు నిధులు అందిస్తున్నారనే కేసులో హఫీజ్ సయీద్‌కి గతంలోనే 11 ఏళ్లు జైలు శిక్ష పడింది. ప్రస్తుతం లాహోర్ జైలులో హఫీజ్ సయీద్ ఆ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు అన్ని విధాల సహాయసహకారాలు అందించిన హఫీజ్ సయీద్.. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలోనూ ముందున్నాడు.
Also read : GHMC Elections: బీజేపి అభ్యర్థుల సెకండ్ లిస్ట్ ఇదే
2019లో జూలై 17న అరెస్ట్ అయిన హఫీజ్ సయీద్‌తో పాటు జేయూడీ సభ్యులపై పాక్ ఉగ్రవాద నిరోధక విభాగం దాదాపు 41 కేసులు పెట్టగా.. అందులో రెండు కేసుల్లో తాజాగా శిక్ష ఖరారైంది ( Hafiz Saeed convicted ). అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసిన హఫీజ్ సయీద్‌ని పట్టిస్తే.. వారికి 10 మిలియన్ డాలర్ల పారితోషికం అందిస్తామని అమెరికా సర్కార్ ప్రకటించింది.
Also read : TRS MP D Srinivas: ఎక్కడి అభివృద్ధి, ఏం అభివృద్ధి..: సొంత పార్టీ ఎంపీ ఘాటు వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి