India Supports Israel: హమాస్ దాడి, ఇజ్రాయిల్ ప్రతిదాడుల నేపధ్యంలో ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. అటు ఇజ్రాయిల్ దేశానికి మిత్రదేశంగా ఉన్న ఇండియా ఆ దేశానికి సంఘీభావం ప్రకటించడమే కాకుండా అండగా ఉంటామని వెల్లడించింది.
ఇజ్రాయిల్ భూభాగాలపై హమాస్ గ్రూప్ ఒక్కసారిగా మెరుపుదాడి చేసింది. నిమిషాల వ్యవధిలో 5 వేల రాకెట్లతో విరుచుకుపడింది. ఫలితంగా భారీ ప్రాణ, ఆస్థినష్టం సంభవించింది. అటు ఇజ్రాయిల్ కూడా పాలస్తీనా భూభాగాలపై వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ దాడుల క్రమంలో ఇజ్రాయిల్ జాతీయ అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. ఇజ్రాయిల్ దేశానికి ఇండియా మద్దతు ప్రకటించింది. హమాస్ తీవ్రవాదుల దాడిని ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. ఇజ్రాయిల్‌పై దాడి చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. తామంతా ఇజ్రాయిల్‌తో ఉన్నామని, బాధితులు, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నట్టు మోదీ తెలిపారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇజ్రాయిల్ దేశానికి ఇండియా అండగా నిలుస్తుందన్నారు.
ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటించడంపై ఇండియాలోని ఇజ్రాయిల్ రాయబారి నౌర్ గిలెన్ స్పందించారు. మోదీకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశం నైతిక మద్దతు చాలా అవసరమన్నారు. ఇరుదేశాల మద్దతుతో ఇజ్రాయిల్ బలపడుతుందన్నారు. అటు ఇజ్రాయిల్ దేశస్థులు కూడా బారత్ చేసిన ప్రకటనకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్యూ ఇండియా, ఇండియా ఈజ్ విత్ ఇజ్రాయిల్ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.
అయితే ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం ఎక్కువకాలం కొనసాగితే భారత విదేశీ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఇండియాతో పాటు ప్రపంచ మార్కెట్ చాలా వరకూ దెబ్బతింది. ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగితే మరిన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
Also read: Afghan Earthquake: ఆఫ్ఘన్ భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య సహాయక చర్యల్లో ఆలస్యం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook