Colombia: చివరకు మోస్ట్​ వాంటెడ్​ డ్రగ్ లార్డ్ పట్టుబడ్డాడు..ఎక్కడో తెలుసా?

Colombia: మోస్ట్​ వాంటెడ్​ మాదకద్రవ్యాల వ్యాపారి ఒటోనియల్.. కొలంబియా భద్రతా బలగాలకు పట్టుబడ్డాడు. ఇతడిపై అమెరికా 50 మిలియన్ డాలర్ల రివార్డు ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 04:29 PM IST
Colombia: చివరకు మోస్ట్​ వాంటెడ్​ డ్రగ్ లార్డ్ పట్టుబడ్డాడు..ఎక్కడో తెలుసా?

Colombia's most wanted drug lord captured in jungle raid: మోస్ట్​ వాంటెడ్​ డ్రగ్ వ్యాపారి(most wanted drug lord) డైరో ఆంటోనియా ఉసుగా అలియాస్​ ఒటోనియల్(Otoniel)​.. కొలంబియా భద్రతా బలగాల చేతికి చిక్కాడు. అవినీతి అధికారుల అండతో దశాబ్ద కాలంగా రహస్యంగా తిరిగిన ఉసుగా ఎట్టకేలకు కొలంబియా(Colombia) సైన్యానికి పట్టుబడ్డాడు. ఈ మేరకు రబ్బరు బూట్లు, సంకెళ్లు వేసిన ఉసుగా ఫొటోలను విడుదల చేశారు అధికారులు. ఉసుగా అరెస్ట్​ను మూడు దశాబ్దాల క్రితం పాబ్లో ఎస్కోబార్(Pablo Escobar)​ను పట్టుకోవడంతో పోల్చారు ఆ దేశ అధ్యక్షుడు ఇవాన్​ డ్యూక్​(President Ivan Duque).

50 మిలియన్ డాలర్ల రివార్డు
ఒటోనియల్​.. దట్టమైన అరణ్యాల గుండా మాదకద్రవ్యాల (కొకైన్) స్మగ్లింగ్(Smuggling)​ చేసే గల్ఫ్ క్లేన్​ బృందానికి నాయకుడిగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా ఉత్తర అమెరికా, మధ్య అమెరికాలకు డ్రగ్స్(Drugs)​ను తరలించేందుకు అనువైన ప్రధాన మార్గాలపై నియంత్రణ సాధించేందుకు హత్యలు చేసి.. ఆ ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఒటోనియల్​ను పట్టుకోవడానికి అమెరికా పోలీసులు(America Police) కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అమెరికా డ్రగ్​ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్​.. మోస్ట్ వాంటెడ్​ క్రిమినల్స్​ జాబితాలో ఇతడిని చాలా కాలం ఉంచింది. అతనిపై రూ.37కోట్ల 50 లక్షలు (50 మిలియన్​ డాలర్లు) రివార్డు ప్రకటించింది అమెరికా.

Also Read: Henley Passport index 2021: ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టులివే..! వీసా లేకున్నా తిరిగి రావచ్చు..!

ఉసుగా(Usuga)పై తొలిసారిగా 2009లో.. అమెరికా నిషేధిత తీవ్రవాద సంస్థకు సాయం, మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నట్లు మన్​హట్టన్​ ఫెడరల్ కోర్టులో ఉసుగాపై అభియోగాలు మోపారు అధికారులు. 2003 నుంచి 2014 వరకు వెనిజులా, గ్వాటెమాల, మెక్సికో, పనామా, హోండురాస్ దేశాల ద్వారా 73 మెట్రిక్​ టన్నుల డ్రగ్స్​ అమెరికాకు చేరవేసినట్లు నేరారోపణలు రుజువవడం వల్ల బ్రూక్లిన్​, మయామి ఫెడరల్​ కోర్టులు ఉసుగాను దోషిగా తేల్చాయి.

అయితే తన కింద ఉన్న 500 మందికిపైగా ప్రైవేటు సైన్యం, అమెరికా, బ్రిటన్​కు చెందిన కొందరు అవినీతి అధికారుల సాయంతో ఏళ్లతరబడి అడవుల్లోని రహస్య స్థావరంలో ఉసుగా తలదాచుకున్నట్లు అధికారులు తెలిపారు. కొలంబియాకు చెందిన గైటానిస్ట్​ సెల్ఫ్​ డిఫెన్స్​ ఫోర్సెస్‌కు ప్రస్తుతం నాయకత్వం వహిస్తున్నట్లు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News