AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

కోవిడ్19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా మరికొన్ని రోజుల్లో అందిస్తాయనుకున్న తరుణంలోనే.. చివరిదశ ప్రయోగాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలలో ఆక్స్‌ఫర్డ్ టీకా చివరిదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడు. 

Last Updated : Sep 11, 2020, 08:21 AM IST
AstraZeneca Vaccine: ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్

Coronavirus vaccine result by year end: జూరిచ్: కోవిడ్19 వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ సంయుక్తంగా మరికొన్ని రోజుల్లో అందిస్తాయనుకున్న తరుణంలోనే.. చివరిదశ ప్రయోగాలకు తాత్కాలికంగా బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలలో ఆస్ట్రాజెనెకా.. ఆక్స్‌ఫర్డ్ టీకా చివరిదశ ప్రయోగాలు జరుగుతున్న క్రమంలోనే.. బ్రిటన్‌లో ఈ వ్యాక్సిన్ తీసుకున్న ఓ వాలంటీర్ అస్వస్థతకు గురయ్యాడు. దీంతో ఈ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ను బ్రిటన్, భారత్ సహా పలు దేశాల్లో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా కంపెనీ సీఈవో గురువారం వ్యాక్సిన్ గురించి కీలక ప్రకటన చేశారు. Also read: AstraZeneca Vaccine: ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ తాత్కాలికంగా నిలిపివేత 

వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌‌ను త్వరలోనే పునఃప్రారంభిస్తామని.. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనే కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆస్ట్రాజెనెకా సీఈఓ పాస్కల్ సోరియోట్ ఆశాభావం వ్యక్తంచేశారు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లనే వాలంటీర్‌కు ఆరోగ్య సమస్యలు తలెత్తాయా..? లేక మరే ఏమైనా కారణాలు ఉన్నాయా అనే దానిపై పరీక్షలు జరుపుతున్నామన్నారు. ఇది తేలిన వెంటనే ట్రయల్స్‌ను పున:ప్రారంభిస్తామని వెల్లడించారు. అయితే వ్యాక్సిన్ పయోగాలకు బ్రేక్ పడ్డ నాటినుంచి పలు దేశాల నుంచి ఆస్ట్రాజెనెకా టీకాపై సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఆ సంస్థ సీఈవో ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also read: AstraZeneca Vaccine: భారత్‌లో కూడా ఆక్స్‌ఫర్డ్ టీకా ట్రయల్స్‌కు బ్రేక్

ఇదిలాఉంటే.. డీజీసీఐ ఆదేశాల మేరకు.. ఆస్ట్రాజెనెకా తదుపరి ప్రయోగాల వరకు భారత్‌లో ఈ వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రముఖ ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (SII)  గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తికి సీరమ్ ఇనిస్టిట్యూట్ ఇండియా(SII) సంస్థ ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్‌తో జతకట్టింది.  Also read: Astrazeneca vaccine: ఇండియాలో పరీక్షలు కొనసాగుతున్నాయి: సీరమ్

Trending News