Ancient Gold Coins: బ్రిటన్‌కి చెందిన ఓ జంట ఉన్నట్లుండి కోటీశ్వరులైపోయారు. తమ ఇంటి కిచెన్ ఫ్లోర్ కింద పురాతన బంగారు నాణేలు దొరకడంతో ఒక్కసారిగా ఆ దంపతుల ఫేట్ మారిపోయింది. ఆ నాణేల విలువ సుమారు రూ.2.3 కోట్లుగా నిపుణులు అంచనా వేశారు. పదేళ్లుగా అదే ఇంట్లో నివసిస్తున్న ఆ దంపతులకు అనూహ్య రీతిలో ఆ పురాతన బంగారు నాణేలు లభించాయి. బ్రిటన్‌లోని నార్త్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్న ఆ దంపతులకు 2019లో ఆ బంగారు నాణేలు లభించగా ఇటీవల వాటిని విక్రయించేందుకు లండన్‌కి చెందిన వేలం నిర్వహణ సంస్థ స్పింక్ అండ్ సన్ని సంప్రదించారు.
బ్రిటన్ మీడియా కథనాల ప్రకారం.. ఆ దంపతులు తమ వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడట్లేదు. పదేళ్లుగా వారు నివాసముంటున్న ఇంటికి 2019లో మరమత్తులు చేపట్టగా.. కిచెన్ ఫ్లోర్ కింద బంగారు నాణేలు లభించాయి. ఫ్లోర్ కింద ఆరడగుల లోతున ఒక లోహపు వస్తువులో ఆ నాణేలను గుర్తించారు. అప్పటివరకూ అక్కడ నాణేలు ఉన్న సంగతి ఆ దంపతులకు తెలియదు.
ఆ నాణేలు 1610-1727 కాలానికి చెందినవాటిగా గుర్తించారు. వాటిని విక్రయించేందుకు స్పింక్ అండ్ సన్ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ అధికారులు ఆ ఇంటికి వెళ్లి నాణేలను పరిశీలించారు. వాటి విలువ మన కరెన్సీలో రూ.2.3 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఆ నాణేలు వాస్తవానికి హల్కి చెందిన ఓ సంపన్న వ్యాపారికి చెందినవిగా భావిస్తున్నారు.ఇలాంటి పురాతన బంగారు నాణేలు మార్కెట్లో వేలానికి రావడం అరుదని పేర్కొన్నారు. అసలు ఆ నాణేలు బయటపడటమే చాలా అరుదైన సంఘటనగా పేర్కొన్నారు.
Also Read: itru Paksha: పితృ పక్షంలో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి, భారీగా నష్టపోతారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook