Lock Down In China: కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కరోజే 31వేల454 కేసులు నమోదయ్యాయి.
Lock Down In China: కరోనా వైరస్ మరోసారి డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. చైనాలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. చైనాలో మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ విధించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కరోజే 31వేల454 కేసులు నమోదయ్యాయి. వీటిలో 27వేల517 కేసులు అసింప్టొమేటిక్ అని చైనా నేషనల్ హెల్త్ బ్యూరో వెల్లడించింది. ఇదే సమయంలో 5వేల మరణాలు కూడా నమోదు అయినట్టు సమాచారం. పాజిటివ్ కేసులు పెరుగుతున్న తరుణంలో కరోనా సోకిన నగరాల్లో కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఆఫీసులు, రెస్టారెంట్లను అధికారులు మూసివేశారు. అనవసరంగా బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక, ఏదైనా నగరంలో చిన్న ఔట్ బ్రేక్ వచ్చినా ఆ నగరం మొత్తాన్ని అధికారులు షట్ డౌన్ చేస్తున్నారు.