10 Pythons in a Village: ఆ గ్రామంలో 10 కొండ చిలువలు... భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు..

10 Pythons in a Telangana Village:  ఒకటి కాదు, రెండు కాదు.. ఆ గ్రామ శివారులో ఏకంగా 10 కొండ చిలువలు ప్రత్యక్షమవడం గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 03:43 PM IST
  • మంచిర్యాల జిల్లాలోని ఓ గ్రామంలో కొండ చిలువల కలకలం
  • గ్రామ శివారులో 10 కొండ చిలువల సంచారం
  • అధికారులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు
10 Pythons in a Village: ఆ గ్రామంలో 10 కొండ చిలువలు... భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు..

10 Pythons in a Telangana Village: ఆ గ్రామ ప్రజలను కొండ చిలువలు భయభ్రాంతులకు గురిచేశాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 కొండ చిలువలు ఆ గ్రామ శివారులో సంచరిస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల ఆలయ నిర్మాణ నిమిత్తం గ్రామ శివారులో స్థల పరిశీలనకు వెళ్లగా గ్రామస్తులు వీటిని గుర్తించారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎట్టకేలకు ఆ కొండ చిలువలను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేశారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఈ ఘటన వెలుగుచూసింది.

వెంకట్రావుపేట శివారులో రామాలయం నిర్మించాలని కొద్దిరోజుల క్రితం గ్రామస్తులు నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవల స్థల పరిశీలనకు వెళ్లారు. అయితే ఆ ప్రాంతంలో 10 కొండ చిలువలు కనిపించడంతో బెంబేలెత్తిపోయారు. వెంటనే అక్కడి నుంచి తిరిగి గ్రామానికి చేరుకున్నారు. కొండ చిలువల సంచారంపై స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సిబ్బందితో రంగంలోకి దిగిన అధికారులు గ్రామస్తులను వెంట పెట్టుకుని వెంకట్రావుపేట శివారు ప్రాంతానికి వెళ్లారు.

అక్కడ సంచరిస్తున్న 10 కొండ చిలువలను గుర్తించి.. వాటిని బంధించారు. అనంతరం గ్రామానికి దూరంగా అటవీ ప్రాంతంలో వాటిని వదిలేసినట్లు అధికారులు వెల్లడించారు. కొండ చిలువలను అక్కడి నుంచి తరలించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Women MLA Horse Riding: గుర్రంపై అసెంబ్లీకి మహిళా ఎమ్మెల్యే, వీడియో వైరల్  

Also Read: Funny Video: జాయింట్ వీల్​ ఎక్కిన ఆ బుడ్డోడు ఏం చేశాడో చూస్తే నవ్వాపుకోలేరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News