టీ సర్కార్ సహాయం కోసం ఉపాసన ట్వీట్.. స్పందించిన కేటీఆర్ !

టీ సర్కార్ సహాయం కోసం ఉపాసన ట్వీట్.. స్పందించిన కేటీఆర్ !

Last Updated : Nov 4, 2018, 11:03 AM IST
టీ సర్కార్ సహాయం కోసం ఉపాసన ట్వీట్.. స్పందించిన కేటీఆర్ !

మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స‌తీమ‌ణి, అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చారిటి విభాగానికి ఉపాధ్యక్షురాలైన ఉపాస‌న వీలున్నప్పుడల్లా పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తమ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగానే తాజాగా ఓ దివ్యాంగుల వ‌స‌తి గృహానికి వెళ్ళిన ఉపాసన.. అక్క‌డ తానే స్వయంగా వారికి భోజ‌నం వ‌డ్డించారు. వారికి దుప్ప‌ట్లు పంచిపెట్టి, అక్కడే కాసేపు సరదాగా గడిపి వారికి ఓ కొత్త ఉత్సాహాన్ని అందించారు. అయితే, ప్రస్తుతం పాఠశాల భవనం మాత్రమే మంజూరైన ఆ దివ్యాంగులకు ఉండటానికి పక్కా వసతి గృహం లేదని తెలుసుకుని, ట్విటర్ ద్వారా తెలంగాణ సర్కార్‌కి ఓ విజ్ఞప్తి చేశారు‌. ఇప్పటికే ఎంతో బాగా పనిచేస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం.. తమపై ఇంకొంత ప్రేమను చూపించి ఈ అమ్మాయిలకు ఓ కొత్త హాస్టల్ భవనాన్ని మంజూరు చేయాల్సిందిగా తన ట్వీట్‌లో కోరారు. తన వంతు ప్రయత్నంగా తాను చేస్తూనే మిగతా సహాయాన్ని ప్రభుత్వం నుంచి కోరుతున్నానని ఆమె ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. పనిలో పనిగా ఆ ట్వీట్‌లో ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ని ట్యాగ్ చేశారు. 

ఉపాసన ఓ సదుద్దేశంతో చేసిన ట్వీట్‌కి వెంట‌నే స్పందించిన కేటీఆర్‌.. పాఠశాల‌ కోసం భ‌వ‌నం మంజూరు కావడం ఎంతో సంతోషంగా ఉందని బదులిచ్చారు. అయితే, హాస్ట‌ల్‌కి కొత్త భ‌వ‌నం మంజూరు కావాలంటే డిసెంబ‌ర్ 11న ఏర్పడబయే కొత్త సర్కార్ వచ్చే వ‌ర‌కు వేచిచూడ‌క త‌ప్ప‌దు అని స్పష్టంచేశారు. కేటీఆర్ ట్వీట్‌కి ప్ర‌తిగా స్పందించిన ఉపాస‌న సైతం ధన్య‌వాదాలు తెలిపారు. 
 

Trending News