మేడ్చల్ జిల్లాలో దారుణం జరిగింది. జవహర్ నగర్‌లో ఇద్దరు యువతుల ఆత్మహత్య కలకలం రేపుతోంది. స్థానికంగా సంచలనం కలిగిస్తున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ డంప్ యార్డ్ సమీపంలో ఇద్దరు యువతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరూ చెరో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతే కాదు వారికి అతి సమీపంలో మరో చిన్నారి మృతదేహం కూడా పడి ఉంది. అసలేం జరిగిందనేది తెలియరావడం లేదని స్థానికులు చెబుతున్నారు.
ఇద్దరు మహిళల గురించి ఎవరికీ తెలియడం లేదు. వారు ఇక్కడకు వచ్చి సామూహికంగా అత్మహత్యకు పాల్పడ్డారా..? చిన్నారిని హత్య చేసి ఇద్దరు మహిళలు ఉరి వేసుకున్నారా..? లేదా వారిని ఎవరైనా హత్య చేసి ఇక్కడకు తీసుకువచ్చి పడేశారా..? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. .జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఇద్దరు యువతుల ఆత్మహత్య