Telangana Rain Alert: ఓ వైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుంటే మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి,. రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నందున జాగ్రత్తగా ఉండాలని ఐఎెండీ హెచ్చరిస్తోంది.
తెలంగాణలో గత కొద్దిరోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత 24 గంటల్లో ఉమ్మడి అదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం, వనపర్తి, కరీంనగర్, మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల్, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో అయితే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది. రానున్న 5 రోజులు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వివరించింది. రేపు ఆదివారం ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక ఇవాళ, రేపు సంగారెడ్డి మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వనపర్తి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, హైదరాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లా, సూర్యాపేట, ఉమ్మడి అదిలాబాద్, నల్గొండ, ఖమ్మం, కొత్తగూడెం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు ఉరుములు మెరుపులు ఉండవచ్చు. వాతావరణం కాస్త ఆందోళనకరంగా ఉంటుంది.
ఇక మంగళవారం అదిలాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి
Also read: NEET UG 2024 Row: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ వాయిదా, తిరిగి ఎప్పుడంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook