Hyderabad: కరోనా టీకాల రాజధానిగా హైదరాబాద్.. మంత్రి కేటీఆర్

Covaxin Gets Approval From DCGI: భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Last Updated : Jan 3, 2021, 03:00 PM IST
  • కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో భారత్‌లో ముందడుగు
  • కోవాగ్జిన్, కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన డీసీజీఐ
  • కోవాగ్జిన్ వ్యాక్సిన్ అమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్
Hyderabad: కరోనా టీకాల రాజధానిగా హైదరాబాద్..  మంత్రి కేటీఆర్

Covaxin Gets Approval From DCGI:  భారతదేశంలో వరుసగా కరోనా వ్యాక్సిన్లకు ఆమోదం లభించడంతో అత్యవసర వినియోగానికి రెండు టీకాలు అందుబాటులోకి రానున్నాయి. తాజాగా భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ టీకా అత్యవసర వినయోగానికి అనుమతి పొందడంపై తెలంగాణ పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 

భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, జేఎండీ సుచిత్ర ఎల్లాలకు మంత్రి కేటీఆర్(KTR) ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. కోవాగ్జిన్ టీకా కోసం కృషి చేసిన శాస్త్రవేత్తల టీమ్‌ను, వారి సేవలను కేటీఆర్‌ కొనియాడారు. హైదరాబాద్ దినదినావృద్ధి చెందుతూ ఇప్పుడు టీకాల రాజధానిగా విరాజిల్లుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 

Also Read: Mi 10i Price (Launch Date): 108 మెగా పిక్సెల్ కెమెరా.. పూర్తి ఫీచర్లు ఇవే

 

 

కాగా, కరోనా వైరస్(CoronaVirus) మహమ్మారిపై పోరాటంలో భాగంగా భారత ప్రజలకు డీసీజీఐ ఆదివారం శుభవార్త చెప్పింది. కొవిషీల్డ్‌తో పాటు కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను కరోనా పేషెంట్లకు అత్యవసర అనుమతికి డిసీజీఐ ఆమోదం తెలిపింది. భారత్ బయోటెక్ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ క్యాక్సిన్లు 110 శాతం మంచివేనని, వీటి నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని డీసీజీఐ పేర్కొంది. 

Also Read: LPG Cylinder Price Hike: ఎల్పీజీ సిలిండర్ ధరలు పెంపు.. తాజా ధరలు ఇలా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News