హైదరాబాద్‌లో 'మోనో రైలు' ప్రాజెక్ట్ !

ఇప్పటికే మెట్రో రైలులో చక్కర్లు కొడుతోన్న హైదరాబాద్ వాసులకి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్‌ని వినిపించింది.

Last Updated : Dec 28, 2017, 01:10 PM IST
హైదరాబాద్‌లో 'మోనో రైలు' ప్రాజెక్ట్ !

ఇప్పటికే మెట్రో రైలులో చక్కర్లు కొడుతోన్న హైదరాబాద్ వాసులకి తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్‌ని వినిపించింది. నిత్యం రద్దీగా వుండే మార్గాల్లో మోనో రైలు ప్రాజెక్టుని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ సర్కారు పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తొలి దశలో హైటెక్ సిటీ మీదుగా గచ్చిబౌలి-మియాపూర్ మార్గంలో 15 కిలోమీటర్ల మేర ప్రభుత్వం మోనో రైలు ప్రాజెక్టుని నిర్మించేందుకు అధ్యయనం చేపట్టినట్టు తెలుస్తోంది. అందుకోసం ప్రభుత్వం పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ)ని సలహా సంస్థగా నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీచేసింది.

మోనో రైలు సేవల వల్ల రద్దీగా వున్న మార్గాల్లో ప్రయాణికుల ఇక్కట్లు తగ్గించవచ్చనేది ప్రభుత్వం యోచన. రైలు పట్టాలతో అవసరం లేకుండా అతి తక్కువ విస్తీర్ణంలో ఒకే వరుసలో నిర్మించిన పిల్లర్లపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ బీమ్‌పై ఈ రైలు ప్రయాణిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా బాగా అభివృద్ధి చెందిన నగరాల్లో మోనో రైలు ప్రాజెక్టులు ప్రజా రవాణా అవసరాలు తీర్చడంలో ముందున్నందు వల్లే తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించిందని సమాచారం.

Trending News