Jeevan Reddy: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ ఎమ్మెల్యే. అటు కేడర్..ఇటు కేరక్టర్ లేని ఓ చిల్లర వ్యక్తి అని తీవ్ర పదజాలంతో దూషించారు. అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని దుయ్యబట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర పదజాలంతో దూషించారు. రేవంత్ రెడ్డి వంటి నేతలు గాంధీభవన్‌లో ఫిడేల్ వాయించుకునే నీరోలని అభివర్ణించారు. రేవంత్ రెడ్డికి ఇటు కేడర్, అటు కేరక్టర్ రెండూ లేవని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకునే అధ్యక్షుడు కాదని..చంద్రబాబు నమ్మకాన్ని నిలబెడుతూ గాంధీ భవన్‌కు టూలెట్ బోర్డు పెడతాడని విమర్శించారు.
హుజూరాబాద్‌లో 3 వేల ఓట్లు తెచ్చుకోలేనోడు..80 లక్షల ఓట్లతో 90 సీట్లు తెస్తాడట అంటూ ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది లేదు..చచ్చేది లేదని విమర్శించారు. కేసీఆర్‌కు ఫ్రంట్ ఉందో..టెంట్ ఉందో అనేది..ఆయన కొట్టే దెబ్బకు రేవంత్ రెడ్డి వంటి వాళ్లకు ఆయింట్మెంట్ రాసుకుని పడుకున్నప్పుడు తెలుస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డిసెంబర్లో అసెంబ్లీ రద్దు కానుందని..ఎన్నికలొస్తాయని చిలక జ్యోతిష్యం చెబుతున్న రేవంత్ రెడ్డికు..ఎన్నికల తరువాత అదే పని మిగులుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్ అనే వ్యక్తి దేశ దిమ్మరి కాదని..దేశాన్ని కాపాడే వెలుగని కీర్తించారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రక్షించేది కాదని..భక్షించేదన్నారు. రాహుల్ ప్రధాని అయితే దేశానికి భరించలేని శిక్ష అని విమర్శించారు.
రేవంత్ రెడ్డి ఒక ఛీటర్
రేవంత్ రెడ్డి ఒక ఛీటర్ అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఒక బుడ్డర్ ఖాన్ అని..పట్టపగలే పట్టుబడిన గజదొంగ అని దూషించారు. చిప్పకూడు తిన్న చిల్లలగాడని తీవ్ర పదజాలంతో దూషించారు. రేవంత్ రెడ్డి అంటే లూటీ అని..అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అని మండిపడ్డారు. భూ భకాసురుడని..అభినవ నరకాసురుడని..ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.
Also read: Telangana CLP Meeting: టీఆర్ఎస్ను సభలో..వీధుల్లో అడ్డుకోవడమే ప్రధాన వ్యూహం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook