Inter exams in May : తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఇంటర్ పరీక్షలు.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహన

Intermediate exams in May 2022 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేదుకు ఇంటర్మీడియట్ బోర్డ్‌లు కసరత్తు చేస్తున్నాయి. బెటర్‌మెంట్ ఎగ్జామ్స్ ను దృష్టిలో ఉంచుకుని, ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ రూపొందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 8, 2022, 12:56 PM IST
  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే నెలలో ఇంటర్ పరీక్షలు
  • ఏర్పాట్లు చేస్తోన్న ఇంటర్మీడియట్ బోర్డ్‌లు
  • మే 2 నుంచి మే 20వ వరకు పరీక్షలు నిర్వహించేలా ప్రణాళిక
Inter exams in May : తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఇంటర్ పరీక్షలు.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్వహన

Telangana Andhra pradesh intermediate exams likely from May first week : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణలో మే 2 నుంచి ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని ఇంటర్మీడియట్ బోర్డ్ (Intermediate Board) భావిస్తోంది. ఇప్పటివరకు ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీఎస్ ఇంటర్ బోర్డ్ చెప్తూ వస్తోంది. అయితే కోవిడ్ (Covid) వల్ల ఆఫ్‌లైన్ తరగతులు ఆలస్యంగా ప్రారంభం కావడంతో మేలో పరీక్షలు నిర్వహించాలనుకుంటోంది. అలాగే ప్రస్తుతం కోవిడ్ థర్డ్ వేవ్ (Covid Third Wave) కూడా ఉండడంతో మేలోనే ఎగ్జామ్స్‌ (Exams‌) నిర్వహించేందుకు కసరత్తు ప్రారంభమైంది. మే 2 నుంచి మే 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు (Inter Exams‌) నిర్వహించేలా టీఎస్ ఇంటర్ బోర్డ్ (TS Inter Board) ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇటీవల ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో (Intermediate first year) 2.35 లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ కాగా.. టీఎస్ సర్కార్ వారందరనీ పాస్ చేసింది. అయితే పాస్ మార్కులతో సంతృప్తి పడని స్టూడెంట్స్.. బెటర్‌మెంట్ ఎగ్జామ్స్ (Betterment Exams) రాసే అవకాశాలున్నాయి. దీంతో ఒక రోజు ఫస్టియర్.. మరుసటి రోజె సెకెండియర్ ఎగ్జామ్స్‌ రాయాలంటే విద్యార్థులు ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని, టీఈఎస్ ఇంటర్ బోర్డు.. ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ (Inter Exams ) రూపొందించాలంటూ విద్యారంగం నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : పార్శిళ్లలో పందెం కోళ్లు... సోషల్ మీడియా ద్వారా అమ్మకాలు... ధర ఏ రేంజ్‌లో ఉందంటే..

ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంటర్మీయట్ ఎగ్జామ్స్‌ను మేలో నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డ్ (AP Inter Board) భావిస్తోంది. మే 5 నుంచి మే 22వ తేదీ వరకు ఇంటర్ ఎగ్జామ్స్‌ (Inter Exams‌) నిర్వహించేందుకు బోర్డ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. కోవిడ్ ఉద్ధృతి లేకపోతే మేలో ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించాలని ఏపీ ఇంటర్ బోర్డ్ (Inter board) భావిస్తోంది.

Also Read : Platform Ticket Rate Hiked: సంక్రాంతి ఎఫెక్ట్... రైల్వే ప్రయాణికులకు షాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News