Street tiffin vendor in contesting as mp in malkajgiri loksabha elections 2024: మన రాజ్యాంగం మనకు గొప్ప అవకాశాలు కల్పించింది. రాజు అయిన, పేదోడు అయిన, ఉన్నోడు అయిన లేనోడు అయిన కూడా డెవలప్ మెంట్ ఫలాలు అందరికి అందేలా చట్టాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు నడుస్తున్నాయి. ఎన్నికలలో పోటీచేయడానికి అందరికి సమానంగా హక్కులు ఉంటాయి. ఉన్నోడో మాత్రమే చేయాలి, పేదవాడు చేయకూడదని ఎలాంటి నియమంలేదు. అందుకు అనేక చోట్ల అసాధారణ వ్యక్తులకు, పోటీగా సామాన్యులు బరిలో నిలుస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇటీవల వడోదర నుంచి ఒక కమెడీయన్ బరిలో నిల్చిన సంగతి తెలిసిందే. ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను ఈక్వల్ గా ఉపయోగించుకోవచ్చు. ఒకరికి ఎక్కువ, మరోకరికి తక్కువ అన్న విధంగా హక్కులు ఉండడు.
Read More: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...
ఇదిలా ఉండగా.. దేశంలో అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్ గిరి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పట్నం సునీత మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో ఉన్నారు. ఈ నేతలంతా కొన్నిరోజులుగ హోరా హోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఒక టిఫీన్ కొట్టు నడిపించే యువకుడు కూడా ఎన్నికల బరిలో నిలబడి అందరిని షాకింగ్ కు గురిచేస్తున్నాడు. చిరిపిరెడ్డి రమేష్ అనే యువకుడు కొన్నేళ్ల కిత్రం హైదరాబాద్ కు సర్కారు కొలువు సాధించాలనే టార్గెట్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చాడు. ఎంత కష్టపడిన కూడా జాబ్ మాత్రం రాలేదు.
దీంతో హైదరాబాద్ లోని చైతన్య పురి ప్రధాన రహాదారి పక్కన ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశాడు. అక్కడ డైలీ మంచి రుచికరమైన టిఫిన్ లను కస్టమర్లకోసం రెడీ చేసేవాడు. తన టిఫిన్ షాపులో మరో ఆరుగురికి ఉపాధి కూడా కల్పించాడు.ఈ క్రమంలో ఇటీవల కొందరుపోలీసులు వీధి వ్యాపారులను అక్కడినుంచి ఖాళీ చేయించారు. రోడ్డుపైన ఉన్న షాపులన్నింటిని తొలగించారు. దీంతో వెయ్యి మంది వరకు వ్యాపారలు, వారిపై ఆధారపడిన వారంతా రోడ్లమీదపడ్డారు. చిరిపిరెడ్డి రమేష్ ఎందరో నేతల్ని, పోలీసులను కలిసి తమ బాధల్నిచెప్పే ప్రయత్నం చేశాడు.
కానీ ఎవ్వరు కూడా సరిగ్గా రెస్పాండ్ కాలేదు. దీంతో ఎలాగైన తన వాయిస్ ను, తమ కష్టాలను అందరికి తెలిసేలా చేయాలనుకున్నాడు. ఈ క్రమంలోనే ఎంపీ ఎన్నికల బరిలో నిలబడ్డాడు. ఎన్నికల అఫిడవిట్ లో.. 50 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయని చెప్పాడు. అంతేకాకుండా తనకు ఎన్నికల ఖర్చు కోసం బంధువులు, తెలిసిన వారు హెల్ప్ చేస్తున్నారంటూ కూడా చిరిపిరెడ్డి రమేష్ తెలిపాడు. ప్రస్తుతం ఒక టిఫీన్ కొట్టు నడిపే యువకుడు ఎన్నికల బరిలో నిల్చుండటం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter