Revanth Reddy vs Allu Arjun: తొక్కిసలాట కేసులో జాతీయ ఉత్తమ నటుడు పురస్కార గ్రహీత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ మినహా అన్ని రాజకీయ పార్టీలు ఖండిస్తుండగా.. అభిమానులు సైతం తప్పుబడుతున్నారు. ఈ వ్యవహారంపై ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అరెస్ట్‌లో తన ప్రమేయం లేదని.. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Also Read: Allu Arjun: పోలీసుల అత్యుత్సాహం.. బెడ్రూమ్‌లోకి రావడంపై అల్లు అర్జున్ ఆగ్రహం
ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ లాబీలో కనిపించిన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై కూడా స్పందించారు. 'అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇందులో నా జోక్యం ఏమీ ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే' అని తేలికగా వ్యాఖ్యానించడం కలవరం రేపింది. చట్టపరమైన ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు.
Also Read: Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్.. కేటీఆర్ సంచలన పోస్ట్..! నెట్టింట వైరల్
'తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మోహన్ బాబు విషయంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక రాజకీయ వ్యవహారాలపై స్పందిస్తూ 'మంత్రివర్గ విస్తరణపై చర్చ లేదు' అని చెప్పారు. ఓవైపు సీరియస్‌గా పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇంకో వైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి' అని తెలిపారు. మంత్రివర్గ క్యాబినెట్ విస్తరణ జరగాలంటే పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎం, ముఖ్య నాయకులతో చర్చలు జరగాలి' అని పేర్కొన్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై అతడి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేసిందే తప్పు.. మళ్లీ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్తావా? అంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు కోసం అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశావంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు, అల్లు అభిమానులు వైల్డ్ ఫైర్‌లో స్పందిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter