Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్

Ys Jagan on Allu Arjun Arrest: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రాజకీయ పార్టీల అధినేతలు, ప్రముఖులు అంతా అరెస్ట్ అక్రమమని ఖండిస్తున్నారు. తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఖండించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 13, 2024, 05:54 PM IST
Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్‌పై అక్రమ కేసులు, అరెస్టు అక్రమం అంటూ వైఎస్ జగన్ ట్వీట్

Ys Jagan on Allu Arjun Arrest: అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్‌పై అందరూ మండిపడుతున్నారు. బీజేపీ, వైసీపీ, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అక్రమమని ఖండించగా తాజాగా వైఎస్ జగన్ ఈ వ్యవహారంపై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమమని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. 

డిసెంబర్ 5న పుష్ప 2 విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్‌ను సందర్శించినప్పుడు జరిగిన తోపులాటలో రేణుక అనే మహిళ మరణించగా ఆమె కుమారుడికి గాయాలయ్యాయి. దాంతో చిక్కడ్ పల్లి పోలీసులు అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్, సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేశారు. ఇవాళ ఒక్కసారిగా హఠాత్తుగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అరెస్ట్ చేశారు. నాంపల్లి 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే ఈ అరెస్ట్‌ను అందరూ ఖండిస్తున్నారు. 

ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ఖండించగా బీజేపీ నేత, కేంద్ర మంత్రి బండి సంజయ్ అక్రమమని స్పష్టం చేశారు. అటు వైసీపీ నేతలు లక్ష్మీ పార్వతి, అంబటి రాంబాబు తదితరులు సైతం అరెస్ట్ అక్రమమని ఖండించారు. తాజాగా ఈ అరెస్ట్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. తొక్కిసలాట ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని అదే సమయంలో దీనిపై స్పందించిన అల్లు అర్చున్ ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి బాధ్యతాయుతంగా వ్యవహరించారని గుర్తు చేశారు. ఈ ఘటనకు నేరుగా అతడిని బాధ్యుడిని చేయడం ఎంతవరకు సమంజసమని వైఎస్ జగన్ ప్రశ్నించారు. తొక్కిసలాటలో అతని ప్రమేయం లేకపోయినా క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదని, తీవ్రంగా ఖండిస్తున్నానని ఎక్స్ సాక్షిగా తెలిపారు.

Also read: Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం, లక్ష్మీ పార్వతి సంచలన ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News