IRCTC Karnataka Tour : ఈ నెలతో ఈ ఏడాది ముగింపు పలికి..కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. అయితే ఇయర్ ఎండ్ తోపాటు క్రిస్మస్ పండగ కూడా వస్తుంది. దీంతో చాలా మందికి సెలవులు వస్తాయి. కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ కు 4 నుంచి 5 రోజులు సెలవులు ఉంటాయి. ఇక ఇయర్ ఎండ్ లో 31, 1 సెలవు ఉంటుంది. అయితే ఈ ఇయర్ ఎండ్ లో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే ఐఆర్ సీటీసీ టూరిజం స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి కర్నాటక ప్రాంతాల్లో పలు పర్యాటక చూపించనుంది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంకో వారం రోజుల్లో ఈ ఏడాది పూర్తవుతుంది. ఈ సంవత్సరం ముగింపులో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నట్లయితే మీకోసం మంచి ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకువచ్చింది ఐఆర్ సీటీసీ. దీనిలో భాగంగా కర్నాటక తీర ప్రాంతంలోని పలు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను చూపించనుంది.
ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్లోకి వెళ్తే కోస్టల్ కర్నాటక పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. హైదరాబాద్ నుంచి దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. ఇది రైలు ప్రయాణం. మురుడేశ్వర్, ఉడిపితోపాటు శ్రుంగేరిని కూడా చూడవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
ఈ ప్యాకేజీ ఆరు రోజులు ఉంటుంది. డిసెంబర్ 17వ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది. ఈ తేదీ తప్పితే మరో తేదీలో కూడా వెళ్లవచ్చు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంచుతుంది ఐఆర్ సీటీసీ.
మొదటి రోజు ప్రయాణం కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 6గంటలకు మొదలవుతుంది. రాత్రి అంతా కూడా జర్నీ ఉంటుంది. 2వ రోజు మంగళూరు సెంట్రల్ కు చేరుతారు. అక్కడి నుంచి ఉడికి వెళ్లి..దగ్గరలో ఉండే శ్రీ క్రిష్ణ టెంపుల్ తోపాటు మాపేల్ బీచ్ కు తీసుకెళ్తారు. రాత్రి ఉడిపిలోనే గడుపుతారు. 3వ రోజు ఉదయం కొల్లూరుకు వెళ్తి..ముఖాంభికా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడి నుంచి మురుడేశ్వర్ కు వెళ్తారు. సాయంత్రం గోకర్ణకు వెళ్తారు. అక్కడ బీచ్ చూసి..రాత్రి మళ్లీ ఉడిపికి చేరుకుంటారు.
4వ రోజు హార్నాడుకు చేరుకుని..అన్నపూర్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత శ్రుంగేరికి వెళ్తారు. అక్కడ శారదంబా ఆలయాన్ని దర్శించుకుంటారు. తిరిగి మంగళూరుకు వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు. 5వ రోజుమంగళూరు చేరుకుని..మంగళాదేవి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం తన్నీర్బవి బీచ్,గోకర్నాథ్ ఆలయా్ని సందర్శిస్తారు. రాత్రి 7గంటలకు మంగళూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు ప్రయాణం మొదలవుతుంది. మరునాడు రాత్రి 11గంటలకు కాచిగూడ చేరుకుంటారు.
ఈ ప్యాకేజీ సింగిల్ షేరింగ్ కు రూ. 39, 140 ఉండగా..డబుల్ షేరింగ్ కు రూ. 22, 710 ఉంది. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 18, 180 ఉంది. కంఫర్ట్ క్లాస్ 3ఏలో ఈ ధరలు ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15, 150గా నిర్ణయించారు. సింగిల్ షేరింగ్ కు రూ. 36, 120 గాఉంది. సింగిల్ షేరింగ్ కు 36, 120 ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19,960 ఉంది. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు కూడా వేర్వేరు టికెట్ ధరలు నిర్ణయించారు.
ఈ టూర్ ప్యాకేజీలోనే టికెట్లు, హోటల్ లో వసతి, అల్పాహారం, లంచ్, డిన్నర్ ఉంటాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR085